హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan Mohan: ఎన్నికల మూడ్ లో సీఎం జగన్.. అప్పుడే గేమ్ స్టార్ట్ చేశారా..?

CM Jagan Mohan: ఎన్నికల మూడ్ లో సీఎం జగన్.. అప్పుడే గేమ్ స్టార్ట్ చేశారా..?

 సీఎం జగన్( ఫైల్)

సీఎం జగన్( ఫైల్)

CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. అందులో భాగంగా యాక్షన్ ప్లాన్ అప్పుడే మొదలెట్టారు. ఇందులో భాగంగా ఆ ఎమ్మెల్యేలకు సిగ్నల్ కూడా ఇచ్చారు.. ఆ జాబితాలో ఎవరున్నారు అంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.

CM Jagan Mohan Reddy Focused on 2024 Elections: ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy).. 2024 ఎన్నికలే టార్గెట్ గా అడుగులు వేస్తున్నారు. అయితే ముందుగానే ఎన్నికలు జరుగుతాయా..? లేకా షెడ్యూల్ ప్రకారమే  ఎన్నికలు ఉంటాయా అన్నదానిపై ఇప్పటి వరకు ఆయన క్లారిటీ ఇవ్వకపోయినా..? వ్యూహాల విషయంలో దూకుడా ముందుకు వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఒత్తిడిలోకి నెడుతూనే.. సొంత పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. రెండో సారి అధికారం చేజికించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల యుద్దానికి.. కసరత్తును ముమ్మరం చేశారు. సీఎం జగన్ ముందునుంచీ చెబుతున్నది ఒకే మాట.. కొంతమంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తక్కువగా ఉందని.. వారు తమ రిపోర్ట్  పెంచుకోకపోతే పక్కన పెడతాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు పార్టీ కోసం పని చేసే వారికి మాత్రమే  పదవులు అంటూ చాలాసార్లు ప్రస్తుత ఎమ్మెల్యేలకు వార్నింగ్ (Warning to YCP MLAs)ఇచ్చారు. అందుకు గడప గడపకు ప్రభుత్వాన్ని  (Gadapa Gadapaku Government) ఉఫయోగించుకోవాలని సూచించారు.

అధినేత టార్గెట్ పెట్టినా..? కొందరిలో మార్పు కనపించలేదని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రక్షాళన మొదలెట్టారని సమాచారం. తాజాగా గుంటూరు జిల్లా (Guntur District) తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించడం వంటి సంఘటనలు చూస్తే జగన్ 2024 ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తున్నారని  తెలుస్తుంది. త్వరలో ఉమ్మడి గుంటూరు జిల్లా లో రేపల్లె స్థానం నుండి సినిమా నటుడు బిసి సామజిక వర్గానికి చెందిన సుమన్ ను పోటీ లో నిలిపే అవకాశం ఉందని తాడేపల్లి వర్గాల లో వినికిడి.

అలానే  మంత్రి మేరుగ‌ నాగార్జునను బాపట్ల పార్లమెంటు నియోజక వర్గం నుంచి బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ను వేమూరు నియోజక వర్గం నుండి మరో మంత్రి ని కూడా స్దాన చలనం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అలాగే మంగళగిరి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణ రెడ్డిని కూడా సత్తెనపల్లి పంపే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి : ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టు నోటీసులు.. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎందుకో తెలుసా..?

నియోజకవర్గం లో ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటారన్న దానిపై సర్వేలు చేయించుకుని..  ఆ సర్వే ఆధారంగానే సీటు కేటాయించే దిశా గా జగన్ అడుగులు వేస్తున్నారని సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగా  తాను నివాసం ఉన్న తాడికొండ నియోజక వర్గం నుండే గేమ్  మొదలు పెట్టారు అంటున్నారు.

ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీకి కారణం ఇదే..? కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఈ ప్రక్షాళన ఒక్క తాడికొండకు మాత్రమే కాదు అంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయని పార్టీలో ఉన్న కీలక నేతలు చెబుతున్నారు. దానికి సంబంధించి ప్రక్షాళన ప్రారంభమైందని అభిప్రాయ పడుతున్నారు. సుమారు 40 నుంచి 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో కొత్త వారికి సీఎం జగన్ అవకాశం ఇవ్వబోతున్నారని సమాచారం.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

ఉత్తమ కథలు