Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOCUS ON NEW POLICE BOSS FOR VIJAYAWADA NGS BK

New Boss: విజ‌య‌వాడ‌కు కొత్త బాస్..? క‌స‌ర‌త్తు చేస్తోన్న సీఎం జ‌గ‌న్?  

బెజవాడకు కొత్త బాస్

బెజవాడకు కొత్త బాస్

New police boss Vijayawada: విజయవాడకు కొత్త కమిషనర్ రానున్నారా..? సీఎం జగన్ ఆ దిశగా కసర్తుత ప్రారంభించారు. ఇప్పటికిప్పుడు ఎందుకు బాస్ ను మార్చాలని జగన్ భావిస్తున్నారు..

    New Police boss for vijayawada:  బెజ‌వాడ‌లో ఇప్పుడు కొత్త చ‌ర్చ‌ జరుగుతోంది.  ప్ర‌స్తుతం ఇక్క‌డ పోలీస్ క‌మీష‌న‌ర్  (Police Commissioner) గా ఉన్న శ్రీనివాసుల‌కు ఈ నెలాఖ‌రుతో ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. దీంతో ఇప్పుడు ఇక్క‌డికి కొత్త‌గా ఏ క‌మీష‌న్ రాబోతున్నార‌నే దానిపై ఏపీ ప్ర‌భుత్వ (AP Government) వ‌ర్గాల్లో తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతుంది. బెజ‌వాడ పోలీస్ క‌మీషన‌ర్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టాలంటే క‌త్తిమీద సామే. ఇక్క‌డ నిత్యం విఐపీలు, వీవీఐపీలు తీరుగుతూ ఉంటారు వీళ్లు అన్ని విభాగాల‌కు సంబంధించిన వాళ్లు అయి ఉంటారు. ఇక్క‌డ క‌మీష‌న‌ర్ గా ప‌ని చేయాలంటే అన్ని విభాగాల‌పై ప‌ట్టు ఉండాలి అంటున్నాయి ప్ర‌భుత్వ వ‌ర్గాలు. మ‌రో వైపు విజ‌య‌వాడ‌ (Vijayawada)కు రాబోయే కొత్త బాస్ పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహాన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కూడా తీవ్ర స్థాయిలో క‌స‌ర‌త్తు చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ ఐజీ స్థాయి అధికారిని క‌మీష‌న‌ర్ గా నియ‌మించాలా లేదా డీఐజీ స్థాయి అధికారిని క‌మీష‌న‌ర్ గా నియ‌మించాల‌న్న‌దానిపై ముఖ్య‌మంత్రి క‌స‌రత్తు చేస్తోన్న‌ట్లు స‌మాచారం.

    నేరాల‌కు, రౌడీల‌కు అడ్డా అయిన విజ‌య‌వాడ లాంటి  సిటీలో క‌మిష‌న‌ర్ గా వ‌చ్చే వ్య‌క్తి చాలా ప‌వ‌ర్ ఫుల్ అయి ఉండాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే కొంత మంది అధికారుల పేర్లను కూడా ముఖ్య‌మంత్రి ప‌రిశీలిస్తోన్న‌ట్లు స‌మాచారం.  బెజ‌వాడ క‌మీష‌న‌ర్ రేస్ లో ఇప్ప‌టికే న‌లుగురు ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  వినీత్ బ్రీజ్లాల్, పాల రాజు, కాంతిరాణా, శ్రీకాంత్ లు రేస్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఈ పోస్ట్ లో డీఐజీ స్థాయి అధికారిని అద‌న‌పు బాధ్య‌త‌ల కోసం డీజీ స్థాయి అధికారుల‌ను నియ‌మించారు.

    ఇదీ చదవండి: సినిమా రెగ్యులేషన్‌ యాక్ట్‌-1955 చట్టంలో సవరణలకు ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

    ఇక్క‌డ నుంచి పోలీస్ క‌మీష‌న‌ర్లుగా ప‌ని చేసిన ప్ర‌స్తుత డీజీపీ గౌత‌మ్ సావాంగ్, తిరుమల‌రావుల‌ది డీజీ హోదాలో నియ‌మించారు. అయితే ప్ర‌స్తుతం అదే లెక్క‌న చూసుకుంటే వినీత్ బ్రిజాల్, కాంతి రాణాల్లో ఎవ‌రో ఒకరికి చాన్స్ ద‌క్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే డీజీ స్థాయి అధికారును నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తే పాల‌రాజు లేదా కాంతిరాణాల్లో ఎవ‌రో ఒక‌రికి చాన్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌యంటున్నారు.

    ఇదీ చదవండి: బ్లూ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసిందన్నారు.. చంద్రబాబుకి ఇదే ఆఖరి రోజు.. ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది.. రోజా పంచ్ డైలాగ్స్..?

    పోలీస్ వ‌ర్గాలు, అయితే కాంత్రి రాణా, పాల‌రాజు గ‌తంలో విజ‌య‌వాడ డిప్యూటీ క‌మీష‌న‌ర్లుగా ప‌నిచేశారు. క్రాంతి రాణా గ‌తంలో విజ‌య‌వాడ డివ్యూటీ క‌మీష‌న్ గా డీఐజీ హోదాలో ప‌ని చేసి త‌రువాత అన‌త‌పురంకి బ‌దిలీ అయ్యారు. పాల‌రాజు గ‌తంలో మంగ‌ళ‌గిరి లో పోలీస్ ప్ర‌ధాన కార్య‌ల‌యంలో సాంకేతిక విభాగానికి ఇన్ చార్జ్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి కొన్ని కీల‌క అంశాల్లో ఎలా వ్య‌వ‌హారించాల‌న్న‌దానిపై సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తోన్నారు దీంతో ఈయ‌నకే అవ‌కాశాలు ఎక్క‌వ ఉండే చాన్స్ ఉందంటున్నారు ప్ర‌భుత్వ వ‌ర్గాలు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Vijayawada, Ys jagan

    తదుపరి వార్తలు