Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOCUS ON 2024 ELECTIONS TO DAY WILL CONDUCT YCLP MEETING NGS GNT

CM Jagan Target 2024: మళ్లీ అధికారమే సీఎం టార్గెట్.. నేడు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం.. జగన్ వ్యూహం ఇదే..

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

CM Jagan Target 2024: ఆంధ్రప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఎవరికి వారు అధికారం తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విపక్షాల మాట ఎలా ఉన్నా.. సీఎం జగన్ మాత్రం.. ముందుగానే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడా ఆ దిశగా సిద్ధం చేసేందుకు రెడీ అయ్యారు. మళ్లీ ఘనవిజయమే లక్ష్యంగా ఇవాళ నిర్వహిస్తున్న వైసీఎల్పీ సమావేశంలో ఏం చెబుతున్నారన్నది చూడాలి.

ఇంకా చదవండి ...
    Anna Raghu, Guntur, News18. 

    CM Jagan Target 2024: ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటూ అప్పుడే టీడీపీ (TDP) సమర శంఖం పూరించింది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత.. తరువాత టార్గెట్ ఏపీలోనే అంటూ.. వచ్చే ఎన్నికలపై అప్పుడు బీజేపీ (BJP) ఫోకస్ చేసింది. ఇక జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawam Kalyan) ఆవిర్భవ సభ పేరుతో.. అప్పుడు సమరం మొదలెట్టేశారు.. అధికార పార్టీని గద్దె దింపడానికి ఏం చేయడానికైనా సిద్ధం అంటూ పొత్తులపైనా క్లారిటీ ఇచ్చారు. ఇలా ప్రతిపక్షాలన్నీ సమరానికి సై అంటుంటే.. వారిందరి కన్నా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy) .. మళ్లీ వైసీపీని అధికారంలోకి తేవడామే లక్ష్యంగా.. అంటే టార్గెట్ 2024 (Target 2024) దిశగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం ఉండాలని.. భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు.. ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నారు సీఎం జగన్.. అందులో భాగంగా ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అనే సంకేతాలు ఇస్తూ.. ఇవాళ వైసీఎల్పీ ( YCLP) సమావేశానికి పిలుపు ఇచ్చారు.

    అందుకే దాదాపు మూడేళ్ల లాంగ్‌ గ్యాప్‌ తర్వాత వైసీఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే లను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే ఈ సమావేశం ప్రధాన అజెండా.. 2024కు ఇప్పట్నుంచి ఎమ్మెల్యేలంతా జనంలోనే ఉండాలంటూ ఆల్రెడీ సంకేతాలిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి. వైసీఎల్పీ మీటింగ్‌లో క్లియర్ డైరెక్షన్స్‌ ఇవ్వనున్నారు. ప్రజల్లోకి ఎలా వెళ్లాలి..? ఏం చెప్పాలి..? మూడేళ్లలో ప్రభుత్వం ఏం చేసింది..? ఇంకా ఏం చేయాలి అనుకుంటోంది.. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు.. సంక్షేమ ఫలాలు ఇలా అన్నింటినీ ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్లాలి అన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌. ఎమ్మెల్యేల పనితీరు, స్థానిక పరిస్థితులపై తన దగ్గరున్న నివేదికలను బయటపెట్టనున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను అలర్ట్‌ చేసి, పనితీరు మార్చుకోవాలని హెచ్చరించనున్నారు.

    ఇదీ చదవండి : ఆశలపల్లకిలో టీడీపీ.. బీజేపీతో పొత్తుపై క్లారిటీ.. పవన్ వ్యూహం ఇదే

    ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక, కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణపైనా చర్చ జరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. మంత్రివర్గ మార్పులపై ఇప్పటికే సంకేతాలిచ్చిన సీఎం జగన్‌, వైసీఎల్పీ మీటింగ్‌లో దానిపై మరింత క్లారిటీ ఇచ్చే అవకాశముంది. మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. దాంతో, కేబినెట్‌ కూర్పు ఎలా ఉండబోతుంది అన్నదానిపైనా నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    ఇదీ చదవండి : ఆశగా చేపల కోసం వల వేశారు.. కానీ ఇవి చిక్కాయి.. వీటి ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

    మంత్రి పదవులు కోల్పోయినవాళ్లు, ఛాన్స్‌ దక్కనివాళ్లు పార్టీ కోసం పనిచేయాలని సూచించనున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏం చేయాలి అన్నదానిపై ఎమ్మెల్యేలకు సూచనలు చేయడంతో పాటు.. ఎవరి బాధ్యత ఏంటి..? ఎవరి పని తీరు ఎలా ఉంది.. పని చేయపోతే పదవులు ఉండవు అనే అంశాలపై ఆయన నేరుగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ycp

    తదుపరి వార్తలు