Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati.
AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకపోయినా.. అప్పుడు నోటిఫికేషన్ వచ్చేసినంత హీట్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అన్నది క్లారిటీ లేదు. సీఎం జగన్ (CM Jagan) అయితే ఏడాదిన్నర లోపే ఎన్నికలు ఉంటాయని చెబుతుంటే.. మంత్రులు, ఆ పార్టీ నేతలు మాత్రం ఎన్నికలు ఏ క్షణమైనా ఉండొచ్చు అంటున్నారు. ఇటు టీడీపీ (TDP) జనసేన (Janasena) సైతం ముందస్తు ఎన్నికలు తప్పవనే అభిప్రాయంలోనే ఉన్నాయి.. అందుకే అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలతో బిజీ ఉన్నాయి.. అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి.
ఇతర పార్టీల కంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి పూర్తి దూకుడుగా వెళ్తున్నారు. అందులో భాగంగా నియోజవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. అలాగే గడప గడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారి ప్రోగ్రస్ రిపోర్ట్ ను తెప్పించుకుంటున్నారు.. ఆ ప్రోగ్రస్ ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాని చెబుతున్నారు. అంతేకాదు మరోవైపు ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉంది అనుకుంటున్నారో.. అక్కడ ఇతర పార్టీల నేతలకు గేట్లు ఎత్తేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నేతలకు ప్రాధాన్య ఇస్తున్నారు.
ఈ విషయంలో టీడీపీ కూడా తగ్గేదేలేదంటోంది. టీడీపీనీ జీరో చేయాలనే లక్ష్యంతోనే వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లెకు వెళ్లిన సీఎం జగన్.. స్థానికంగా టీడీపీకి కీలకంగా ఉన్న నేతలు పార్టీలో చేర్చుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పేశారు. దీంతో చంద్రబాబు సొంత ప్రాంతం నుంచే టీడీపీకి ఝలక్ ఇచ్చేలా వైసీపీ స్కెచ్ వేసిందన్న సంగతి అర్ధమవుతోంది.
ఇదీ చదవండి : న్యూ ఇయర్ తొలి రోజు ఇలా చేయండి.. ఏడాది మొత్తం మీ దగ్గర డబ్బేడబ్బు
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సై అనేలా ఉండేందుకే వైసీపీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందన్న టాక్ వినిపిస్తోంది. బాబు సొంత ప్రాంతంలో ఆ పార్టీకి షాకివ్వడంతో పాటు టీడీపీ బలంగా ఉన్న ఉత్తరాంధ్రలోనూ ఆ పార్టీని ఊహించని దెబ్బకొట్టాలని ప్లాన్ వేశారట సీఎం జగన్. అందుకే ఆ ప్రాంతంలోని కీలక నేతలతో వైసీపీ నాయకత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే పార్టీలో చేర్చుకోవాల్సిన లీడర్ల లిస్టును పార్టీ పెద్దలు రెడీ చేసినట్టు సమాచారం. ఎన్నికల నాటికి టీడీపీకి లీడర్లు లేకుండా చేయాలనేది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది. పనిచేసే లీడర్లు లేకపోతే తమ పని సులభమవుతుంని వైసీపీ భావిస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.
జిల్లాల వారీగా ఆయా లీడర్లకు గాలం వేసేలా వైసీపీ ముందుకెళ్తున్నట్లు టాక్.
ఇందులో భాగంగానే విశాఖలో కీలక నేత అయిన మాజీ మంత్రి, వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును వైసీపీ నేతలు అప్రోచ్ అయ్యారట. పార్టీ చేరికపైనా చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు చేరితేనే బెటర్ లేకుంటే కష్టం అంటూ కొందరు వైసీపీ నేతలు గంటాను టెంప్ట్ చేసే కామెంట్స్ కూడా చేశారని తెలుస్తోంది. గంటాతో పాటు ఇంకా టీడీపీలోనే ఉన్న ముఖ్యనేతలను కూడా వైసీపీ లాగేసేలా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 5 పైసల కాయిన్ తెచ్చుకోండి..? స్టార్ భోజనం ఫ్రీగా పొందడి. 400 రూపాయలు ఉచితమే
ఈ విషయంలో టీడీపీ కూడా కాస్త బెటర్ గానే ఆలోచిస్తోందట. ప్రస్తుతం వైసీపీపై నేతల్లో పెద్దగా సంతృప్తి లేదు. కారణం పనులు జరగకపోవడం, కాంట్రాక్టర్లకు పనులు, వాటి తాలూకా బిల్లులు ఇప్పించలేకపోవడం వంటివాటిపై నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో కాస్త గట్టిగా ట్రై చేసి వైసీపీ నుంచి కూడా నేతలను లాగితే నైతికంగా బలపడే ఛాన్స్ ఉంటుందని.. వైసీపీ వైపు వెళ్లాలనుకునే టీడీపీ నేతలు కూడా ఈ చేరికలతో ఆగిపోతారనేది టీడీపీ ప్లాన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Chandrababu Naidu