AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FOCUS ON 2024 ELECTIONS AND KEY COMMENTS ON CABINET MEETING NGS
CM Jagan: కేబినెట్ లో కొనసాగే ఆ ఐదుగురు ఎవరు..? వచ్చే ఎన్నికలు ఆయనకు కీలకం కానున్నాయా..? మంత్రులు ఏమన్నారంటే..?
సీఎం వైఎస్ జగన్
CM Jagan: సీఎం జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో కొనసాగే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు 2024 ఎన్నికల విషయంలో సీఎం జగన్ కు అనుమానాలు ఉన్నాయా..? మంత్రులు తో ఆయన ఏం చెప్పారో తెలుసా..?
CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కేబినెట్ లో కొనసాగే ఆ ఐదుగురు మంత్రులు ఎవరు..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.. మొదటి నుంచి కేవలం ఇద్దర్ని మాత్రం కేబినెట్ లో కొనసాగించే మిగిలిన వారిని కేబినెట్ నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. కేబినెట్ ముగిసిన తరువాత మంత్రి కొడాలని నాని, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలతో.. ఐదుగురు మంత్రులను తిరిగి కొనసాగిస్తారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆ ఐదుగురు ఎవరు అంటూ చర్చ జరుగుతోంది. కేబినెట్ మీటింగ్ లో మంత్రులు అంతా మూకుమ్మడి రాజీనామాలు చేసిన సమయంలోనూ దీనిపై సీఎం క్లారిటీ ఇవ్వలేదు అంటున్నారు. కేవలం అనుభవం రీత్యా ఐదుగుర్ని మాత్రం కొనసాగిస్తానని మాత్రమే జగన్ చెప్పారని మంత్రులు చెబుతున్నారు. అయితే తాను కొత్త మంత్రివర్గంలో ఉంటానని అనుకోవడం లేదని కొడాలి నాని స్సష్టం చేశారు. అలాగే ఇదే తనకు చివరి సమావేశం అని పేర్ని నాని స్పష్టం చేశారు.
తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చూస్తే.. ఐదారుగురు సీనియర్లను కొనసాగిస్తామని సీఎం చెప్పారని అన్నారు. అంటే సీనియార్టీ ప్రకారం చూసుకుంటే.. మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు తప్పక కొనసాగిస్తారని తెలుస్తోంది. దీంతో పాటు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ఉంటారు అనుకున్నా.. వారిద్దరు మాత్రం తమకు ఇదే చివరి కేబినెట్ మీటింగ్ అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో మంత్రి బాలినేని లేదా బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిలను కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురితో పాటు.. సామాజిక సమీకరణాలు నేపథ్యంలో.. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాంకు.. అధినేత మళ్లీ అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు వచ్చే ఎన్నికల విషయంలోనూ సీఎం జగన్ కు అనుమానాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మంత్రులు చెప్పిన మాటలు చూస్తే.. సీఎం జగన్ వచ్చే ఎన్నికలపై అత్యధికంగా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే.. వచ్చే ఎన్నికలు చంద్రబాబుకు చాలా ముఖ్యమని సీఎం జగన్ మంత్రులకు చెప్పినట్టు సమాచారం. మళ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడితే.. ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే అని.. అందుకే ఆయన గెలుపు కోసం ఏమయనా చేయొచ్చని.. మీరంతా వచ్చే ఎన్నికల విలషయంలో జాగ్రత్తగా ఉండాలని.. చంద్రబాబును ఓడించే బాధ్యత మీరే తీసుకోవాలని.. మాజీలు అవుతున్న మంత్రులకు సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ మాటలను విశ్లేషించుకుంటే.. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని క్లారిటీకి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలాగే ఈ కేబినెట్ చివరి మీటింగ్ లో సీఎం జగన్ మంత్రులు అందరితో చాలా సరదాగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే మంత్రి పదవుల నుంచి తప్పించడం చాలా ఆవేదన కలిగిస్తోంది అన్నారని.. అలాగే వేయి రోజులు తనతో కలిసి పని చేసిన మీరందర్నీ ఎప్పటికీ మరిచిపోలేనని ఆయన చెప్పినట్టు సమాచారం. ఈ సందర్భంగా మీలో కొంతమంది మళ్లీ కేబినెట్ లో కొనసాగుతారని.. అయితే 11వ తేదీన మంత్రులంతా అందుబాటులో ఉండాలని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది..
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.