M BalaKrishna, Hyderabad, News18. ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసిన కేబినేట్ విస్తరణకు సర్వం సిద్దమైంది. మరో రెండు వారాల్లో కేబినేట్ విస్తరణకు జగన్ మూహుర్తం ఖరారు చేసినట్లు తాడేపల్లిలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ తమ గ్రౌండ్స్ ను సైతం సిద్దం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే తమ మంత్రి పదవికి తమ సొంత వ్యాపారాలు అడ్డు వస్తాయని భావిస్తున్నారు. ఒకవేళ మంత్రి పదవి వస్తే ఈ వ్యాపారాలు వలన విమర్శలు వస్తాయనుకుంటే వాటి నుంచి తప్పుకోవడం లేదా వాటిని తమ సన్నిహిత వర్గాలకు ఇవ్వడం చేస్తోన్నారు కొందరు ఆశావాహ ఎమ్మెల్యేలు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కేబినేట్ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు అవుతుండడంతో జగన్ మొదట్లో చెప్పినట్లు రాబోయే రెండేళ్లు కొత్త వారికి అవకాశాలు కల్పిస్తాని ఆ దిశగానే జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో ఒకరిద్దరు వినహా దాదాపు అందర్ని తప్పించి కొత్త వారికి పట్టం కట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే జగన్ క్షేత్రస్థాయి నివేధికలు కూడా సిద్ధం చేసుకున్నారని టాక్. ఈ కొత్త కేబినేట్ తోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోన్న నేపధ్యంలో కుల సమీకరణలతోపాటు స్తానికంగా ప్రజల్లో ఉన్న నేతలకు జగన్ అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాడేపల్లి నుంచి ఎవరినైతే కేబినేట్ లోకి తీసుకోబోతున్నారో వారికి కాల్స్ కూడా వెళ్లాయని త్వరలో తమను కేబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు సమాచారం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కేబినేట్ లోకి తీసుకుంటున్నారు మీరు సిద్దంగా ఉండడండి అనే కాల్స్ ముఖ్యమంత్రి కార్యలయం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలకు వెళ్లినట్లు సమాచారం.
తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ముఖ్యమంత్రి కార్యలయం నుంచి స్పష్టమైన కొన్ని ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. రోజా ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉంటూనే తన ప్రొఫెషనల్ కేరీర్ కూడా జబర్దస్త్ తోపాటు పలు కార్యక్రమాల్లో తాను జడ్జ్ గా వ్యవహారిస్తోంది. అయితే మంత్రి పదవి ఇస్తోన్న నేపధ్యంలో రోజాను అవి మానుకోమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రోజా మల్లేమాల వాళ్లకు కూడా తాను ఇక పై జడ్జ్ గా కొనసాగాలేనని చెప్పినట్లు సమాచారం.
కేవలం జబర్దస్త్ ఒక్కటే కాదు.. శ్రీదేవీ టాకిస్ వంటి పలు కార్యక్రమాల్లో కూడా రోజా ఇక పై కొనసాగబోనని తెల్చిచెప్పిసినట్లు సమచారం. అయితే రోజాకు జగన్ అధికారంలోకి వచ్చినప్పుడే పదవి ఇవ్వాల్సి ఉండేది. ఆమెకు మంత్రి ఇస్తారు అనే ప్రచారం జోరుగా చేశారు. అయితే తొలి కేబినేట్ లో కొన్ని సామాజిక సమీకరణాలు సెట్ కాకపోవడం వలన రోజాకు అవకాశం ఇవ్వలేకపోయారు.
అయితే ఆ సమయంలో ఆమెతో జగన్ వ్యక్తిగతంగా మాట్లాడి ఒక్క రెండేళ్లు వైట్ చేయమన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు రోజాకు అవకాశం కల్పించబోతున్నారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే రోజాకు అందరు అనుకున్నట్లు హోం శాఖ ఇస్తారా లేదా ఇతర శాఖలేవైన ఇస్తారా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.