హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్ పేరు పెట్టమని టీడీపీ ముందుకు రావాలన్న జగన్

CM Jagan: హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుకు కారణం ఇదే.. ఎన్టీఆర్ పేరు పెట్టమని టీడీపీ ముందుకు రావాలన్న జగన్

హెల్త్ యూనివర్శిటీపై సీఎం జగన్

హెల్త్ యూనివర్శిటీపై సీఎం జగన్

CM Jagan : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ గందరగోళానికి తెరలేపిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. తనను తాను ప్రశ్నించుకున్న తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. అలాగే టీడీపీకి సైతం ఓ ఆఫర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరో రాజకీయ రచ్చకు తెరలేపింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ (NTR Health University) పేరు.. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Dr YS Rajasekhar Reddy ) హెల్త్ యూనివర్శిటీ అని పేరు మార్చారు. ఆ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది కూడా.. ఈ నిర్ణయంపై తెలుగు దేశం (Telugu Desam  నేతలతో పాటు.. ఇతరులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) .. ఎన్టీఆర్ ను తాను చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కంటే ఎక్కువగా అభిమానిస్తాను అన్నారు. ఆయనపై ప్రేమే తప్ప పగ లేదు అన్నారు. అందుకే ఎన్టీఆర్ పేరుపై ఒక జిల్లాను సైతం ఏర్పాటు చేశానని గుర్తు చేశారు.

  ఎన్టీఆర్ కు గుర్తింపు రాకూడదని కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. కానీ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడేవారు దేశంలోనే ఉండరు అన్నారు. ఎన్టీఆర్ తన కూతుర్ని ఇచ్చి చంద్రబాబు నాయుడుకు పెళ్లి చేస్తే.. ఆయన వెన్నుపోటును రిటన్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ ఆరోపించారు.

  తాను ఎప్పుడూ ఎన్టీఆర్‌ను ఒక్కమాట కూడా అనలేదన్నారు. ఎన్టీఆర్‌ పేరు తీసుకుంటే చంద్రబాబుకు నచ్చదని... చంద్రబాబు పేరు తీసుకుంటే పైనున్న ఎన్టీఆర్‌కు నచ్చదు అన్నారు. వెన్నుపోటు పొడవకపోయి ఉంటే ఎన్టీఆర్‌ ఎక్కువ కాలం సీఎంగా ఉండేవారని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో తనను తాను ప్రశ్నించుకున్న తరువాతే నిర్ణయం తీసుకున్నాను అన్నారు.

  ఇదీ చదవండి : టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ సీరియస్.. కుర్చీలోంచి లేచి.. ఇయర్ పోన్స్ ను టేబుల్ పె పెట్టి ఆగ్రహం..

  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరులోనే డాక్టర్ ఉంది అన్నారు. అలాగే వైద్యాన్ని పేదలకు చేరువ చేయడంలో ఆయనే ముందు ఉంటారని గుర్తు చేశారు. ఈ రోజులు పేదలకు ధైర్యంగా వైద్యం చేయించుకోగలుగుతున్నారు అంటే అందుకు కారణం ఆనాడు వైఎస్ పెట్టిన పథకాలే కారణం అన్నారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని ఆయన తపించారని.. తండ్రిగా ఆయన ఒక అడుగు ముందుకు వేస్తే.. తాను ఆయన తనయుడిగా మూడు అడుగులు ముందుకు వేశాను అన్నారు జగన్.

  ఇదీ చదవండి: వైసీపీ సర్కార్ కు వల్లభనేని వంశీ షాక్.. జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన ఎమ్మెల్యే.. ఎందుకంటే

  తెలుగు దేశం ఎమ్మెల్యేలు అనవసరంగా గొడవలు చేసి సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండి ఉంటే బాగుండేదని సీఎం అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ అంటే తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్‌మోహన్‌రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడని గుర్తు చేశారు. ఎప్పుడూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదన్నారు. పైగా ఎన్టీఆర్‌ మీద నాకు ఆప్యాయతే ఉంది. అందుకే ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ మా తరపున ఏనాడూ చేయలేదన్నారు.

  ఇదీ చదవండి : శ్రీవారికి భారీగా భూరీ విరాళం.. భక్తితో చెక్ అందించిన ముస్లిం దంపతులు.. విలువ ఎంతో తెలుసా?

  దివంగత మహానేత వైఎస్సార్‌.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్ అన్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనది. ఆ సమయంలో దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందని సీఎం జగన్‌ ప్రస్తావించారు. ఏపీలో 11 మెడికల్‌ కాలేజీలకు ఎనిమిది, టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్‌ కాలేజీ పెట్టలేదు. మూడు మెడికల్‌ కాలేజీలు వైఎస్సార్‌ హయాంలోనే వచ్చాయి. దానికి తోడు ప్రస్తుతం మరో 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా.. ఏపీలో నిర్మాణ దశలో ఉన్నవి కలుపుకుని 28 మెడికల్‌ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్‌, ఆయన కొడుకు (వైఎస్‌ జగన్‌) హయాంలోనే వచ్చాయని.. అలాంటప్పుడు వైఎస్సార్‌ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా? అని టీడీపీని సీఎం జగన్ నిలదీశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, TDP, Ycp

  ఉత్తమ కథలు