Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY CHANGE HIS STRATEGY FULL FOCUSED ON PARTY NGS

CM Jagan: ఢిల్లీ పర్యటన తరువాత మారిన జగన్ వ్యూహం.. ఆ దూకుడుకు కారణం అదేనా..?

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

CM Jagan: సీఎం జగన్ లో ఇంత మార్పు ఏంటి..? ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఢిల్లీ పర్యట నుంచి వచ్చిన తరువాత జగన్ తీరులో మార్పు కనిపించింది అంటున్నారు.. అందుకే ఇప్పుడు దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఇద్దరు మంత్రులను తప్ప అందర్నీ తప్పించాలి అని ముందు అనుకున్నా.. తాజా వ్యూహంలో భాగంగా రెండో అవకాశం ఇచ్చే వారి సంఖ్యను పెంచారు.

ఇంకా చదవండి ...
  CM Jagan Focus on Party: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) దూకుడు పెంచారా..? మొన్నటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్టు దూసుకుని వెళ్తున్నారా..?  2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా లెక్కలు వేస్తున్నారా.. కేవలం వ్యూహాలే కాదు.. మాట తీరూ మారింది. మొన్నటి వరకు హుందాగా సీఎం హోదాలో  విపక్షాలు చేసిన విమర్శలను కూడా లైట్ తీసుకునే వారు.. సమయం వచ్చినప్పుడు  వాటికి కౌంటర్లు ఇచ్చేవారు.. కానీ ఒక్కసారి మాటల్లో పదును పెంచారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. విపక్షాలు ఆయనది ఫ్రష్టేషన్ అంటున్నాయి.. అధికార పార్టీ వాస్తవాలు మాట్లాడుతున్నారని అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ దూకుడు పెంచారని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ పర్యటన (Delhi Tour) నుంచి వచ్చిన తరువాతే సీఎం తీరులో మార్పు వచ్చిందంటున్నారు. ప్రతిపక్షాల పై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అందులో తీవ్ర పదాలను ప్రయోగిస్తున్నారు. సీఎం జగన్ నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ (Prime minster Modi)తో భేటీ అయ్యారు. దాదాపుగా గంటకు పైగా ఏపీకి చెందిన పాలనా వ్యవహారాలతో పాటుగా రాజకీయ అంశాల పైన చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక, వస్తూనే.. తన రాజకీయ వ్యూహాలను పదును పెట్టారు.

  ముఖ్యంగా ఇకపై పార్టీకే అధికసమయం వెచ్చించాలని.. కార్యకర్తలకు నిత్యం టచ్ ఉండాలని నిర్ణయించారు. మూడేళ్ల కాలంగా అప్పుడప్పుడు మినహా ప్రజల్లోకి రాలేకపోయారు. క్యాంపు కార్యాలయం వేదికగా అన్ని పథకాలను ప్రారంభించారు. కానీ, ఈ వారంలోనే రెండు జిల్లాల్లో పర్యటించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి.. ఒక బహిరంగ సభల్లో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు. ప్రధానంగా చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ పేరు మార్చి.. దత్తపుత్రుడు అనే పిలుస్తున్నారు.

  ఇదీ చదవండి : చివరి నిమిషంలో కేబినెట్ కూర్పులో ట్విస్ట్.. బుజ్జగింపులపై సజ్జల క్లారిటీ..

  పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేనలు కలసి పోటీ చేయడం పక్కా అని సీఎం జగన్ ఫిక్స్ అయినట్టు ఉన్నారు. చంద్రబాబు - పవన్ ఒక్కటే అనే భావన కలిగేలా చేస్తున్నారు. ఎవరైనా అసూయతో రగిలిపోతే తొందరగా బీపీ వస్తుందని, దాంతో నేరుగా టికెట్ తీసుకుంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు ఇంకా ఆగడం లేదు. దానికి కౌంటర్ గా చంద్రబాబు చాలాకాలం బతుకుతారు అంటూ టీడీపీ నేతలు సీఎం జగన్ వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. అంతేకాదు చంద్రబాబు హత్యకు కుట్రలు జరుగుతున్నాయంటూ ఆందోళన చెందుతున్నారు.

  ఇదీ చదవండి : కొత్త మంత్రుల జాబితా రెడీ? మళ్లీ కొనసాగేది ఎవరు.. ఏ లెక్కన ఎవరికి ఛాన్స్..?

  ఇక నంద్యాల వేదికగా మాటల దాడి సీఎం జగన్ రెట్టింపు చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉంటే తనని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.. అంతెందుకు.. ఏమీ పీకలేరని కూడా వ్యాఖ్యానించారు. పార్టీలో క్షేత్ర స్థాయిలో స్తబ్దుత నెలకొని ఉందని.. ప్రతిపక్షాల ప్రచారంతో నెలకొన్న డైలమాను తొలిగించి.. కొత్త ఊపు తెచ్చేందుకు జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదీ కూడా ఢిల్లీ నుంచి వస్తూనే ఎటాకింగ్ మొదలు పెట్టారు జగన్. అంటే ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో సమావేశమైన సమయంలో తాను రాజకీయంగా తీసుకోబోతున్న నిర్ణయాల గురించి సీఎం జగన్ వివరించినట్లు తెలుస్తోంది.

  ఇదీ చదవండి : పంతం నెగ్గించుకున్న అశోక్ గజపతి రాజు.. మరి సంచయిత భవిష్యత్తు ఏంటి..?

  ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండవని అధికార పార్టీ నేతలు చెబుతున్నా.. సీఎం జగన్ దూకుడు చూస్తుంటే... పరిస్థితులు తనకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయనే నమ్మకం కలిగిన వెంటనే ఏ నిర్ణయం తీసుకోవటానికి రెడీ అయినట్టు కనిపిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు వైసీపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్దేశించారు. సీఎం సైతం సాధ్యమైనంత వరకు జిల్లాల పర్యటనలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్రక్షాళన..పార్టీ పదవులు ఖరారు చేసిన తరువాత సీఎం జగన్ తన వ్యూహాలను అమలు చేసేందుకు కొత్త వ్యూహాలతో ముందకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Politics, Ycp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు