హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: సొంత సామాజిక వర్గానికే ఓటు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తొలిసారి వైసీపీ.. నిర్ణయానికి కారణం ఇదే

CM Jagan: సొంత సామాజిక వర్గానికే ఓటు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో తొలిసారి వైసీపీ.. నిర్ణయానికి కారణం ఇదే

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

CM Jagan: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఈ సారి అధికార వైసీపీ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికలకు చాలా సమయమే ఉన్నా..? అప్పుడే ఎందుకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో కేవలం అభ్యర్థులకు మద్దతు ఇచ్చే.. పార్టీ ఇప్పుడు నేరుగా ఎందుకు బరిలో దిగుతోంది.. అది కూడా సొంత సామాజిక వర్గానికే సీఎం ఎందకు పెద్ద పీట వేశారు.

ఇంకా చదవండి ...

  CM Jagan:  గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (Graduate MLC Elections) పోటీ చేయాలా? పోటీచేసినవారికి మద్దతు ఇవ్వాలా..? ఎన్నికలకు దూరంగా ఉండాలా..? సాధారణంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే.. ఇలాంటి చర్చే జరుగుతుంది. కానీ ఈ సారి రోటీన్ కు భిన్నంగా అధికార వైసీపీ (YCP) కీలక నిర్ణయం తీసుకుంది. నేరుగా ఎన్నికల బరిలో దిగాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి రావడంతో.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆమోదం తెలిపారు.. ఆ వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను కూడా అధినేత ప్రకటించారు. ఇక, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు స్వీకరించారు ముఖ్యమంత్రి.. గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలను గతంలో ప్రధాన పార్టీలు పెద్దగా ప్రాధాన్యతగా తీసుకునేవి కావు. ఎవరో ఒకరికి మద్దతు ఇవ్వడమో, ఉత్సాహం ఉన్నవాళ్లు ముందుకొస్తే వారికి అండగా నిలబడ్డమో జరిగేది. కానీ ఈ సారి నేరుగా పార్టీ అభ్యర్థులనే దింపాలని సీఎం జగన్ ఫిక్స్ అయ్యారు.

  ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే..? శాసనమండలిలో ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలకు మద్దతుకోరితే, తమ మద్దతుతో గెలిచిన వారుకూడా.. సపోర్ట్ చేయని పరిస్థితులు చూశామని. సీఎం జగన్ తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేరుగా పార్టీ అభ్యర్థులను బరిలో దించడమే మంచిందని సీఎంతో ఎమ్మెల్యేలు తెలిపారు. చివరికి ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సీఎం జగన్ అంగీకరించారు. గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లోకి మనం వెళ్తున్నామన్నారు. ముందుగా ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని మూడు గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను సీఎం ఖరారు చేశారు.

  గ్రాడ్యుయేట్స్‌ స్థానాలకు సీఎం జగన్‌ ప్రకటించిన అభ్యర్థులు వీరే.

  ఉమ్మడి విశాఖ–విజయనగరం–శ్రీకాకుళం గ్రాడ్యుయేట్‌స్థానానికి ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న ఎస్‌. సుధాకర్‌.

  ఉమ్మడి ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి గూడూరు నియోజకవర్గానికి చెందిన శ్యాంప్రసాద్‌రెడ్డి

  ఉమ్మడి కర్నూలు–కడప–అనంతపురం గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి వెన్నపూస రవి

  ఇదీ చదవండి : ఒకప్పుడు నెత్తురు ఏరులై పారింది.. ఇప్పుడు అభివృద్ధిలో అగ్రగామి.. ఎలా సాధ్యమైంది అంటే?

  వచ్చే ఏడాది మార్చితో ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానాల కాలపరిమితి ముగియనుంది. వారి స్థానాల్లో ఈ ముగ్గురుని పార్టీ తరపున పోటీ చేయించనున్నారు సీఎం జగన్. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పార్టీ తరఫున నేరుగా అభ్యర్ధుల్ని బరిలోకి దింపాలని వైసీపీ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలో రాజకీయ చర్చ జరుగుతోంది. మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో కొన్నేళ్లుగా ఈ ఎన్నికల్లో పార్టీలు నేరుగా తమ అభ్యర్దుల్ని బరిలోకి దింపకపోయినా పార్టీల మద్దతుతోనే అభ్యర్ధులు బరిలోకి దిగేవారు. దీంతో ఆయా అభ్యర్ధుల గెలుపు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. చివరికి వైసీపీ తొలిసారి నేరుగా అభ్యర్ధుల్ని రంగంలోకి దింపాలని నిర్ణయించింది.

  ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ఫైట్.. హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమని అడగగలమా? బొత్స సంచలన వ్యాఖ్యలు

  విశాఖపట్నాన్ని రాష్ట్ర కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన తరువాత అక్కడ ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోంది. కీలకంగా.. ప్రస్తుతం ఈ స్థానం బీజేపీ ఆధీనంలో ఉంది. ఎమ్మెల్సీ మాధవ్ ఇక్కడ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. అందుకే ఈ స్థానాన్ని బ్రాహ్మణ అభ్యర్థికి ఖరారు చేశారు. ఇక అనంతపురం-కడప-కర్నూలు నియోజకవర్గానికి వెన్నపూస రవీంద్ర రెడ్డి పేరును ప్రతిపాదించింది. ప్రస్తుత శాసనమండలి సభ్యుడు గోపాలరెడ్డి కుమారుడే ఆయన. ఇక చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాం ప్రసాదరెడ్డి పేరును ఖరారు చేసింది. అంటే ముగ్గురిలో ఇద్దరి సీఎం సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. మరోవైపు ఈ ఎన్నికల ద్వారా విద్యావంతులు.. ఉద్యోగులు ఎటువైపు ఉన్నారు అన్నదానిపై ఒక క్లారిటీ వస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. ఎందుకంటే చాలా రోజులుగా విపక్షాలు చేస్తున్న విమర్శ ఏంటంటే.. ఉద్యోగస్తులు, విద్యావంతులు వైసీపీకి దూరమయ్యారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ బలం కూడా అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటున్నారు జగన్.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics

  ఉత్తమ కథలు