Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN CABINET GREEN SIGNAL TO FINAL DRAFTS FOR NEW DISTRICT NGS

AP New District: కొత్త జిల్లాల ఫైనల్ డ్రాఫ్ట్ కు కేబినెట్ ఆమోదం.. చంద్రబాబుకు జగన్ గిఫ్ట్.. మరి బాలయ్య మాటేంటి?

ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్

AP New District: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఫైనల్ డ్రాఫ్ట్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.. ఇక గవర్నర్ ఆర్డినెన్స్ రావడమే ఆలస్యం.. ఆ వెంటనే కొత్త జిల్లాల అవతరించనున్నాయి. అయితే ఈ ఫైనల్ డ్రాఫ్ట్ లో ఏముంది..? అభ్యంతరాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. చంద్రబాబు, బాలయ్య విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తి పెంచుతోంది.

ఇంకా చదవండి ...
    AP New District:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కొత్త జిల్లాల (AP New Districts) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల పేర్లు, హద్దులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.. కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్ 4న ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందించింది.  తాజాగా జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్‌ డ్రాఫ్ట్‌ కూడా సిద్ధం అయ్యింది.. దీనికి ఏపీ కేబినెట్‌ (AP Cabinet) ఆమోద ముద్ర వేసింది.. వర్చువల్‌గా సమావేశమైన కేబినెట్‌.. దీనికి ఆమోదం తెలిపింది.. త్వరలో గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ రాబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని లేని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ (Govener Bishvabhushan). ఏప్రిల్‌ 1వ తేదీన భువనేశ్వర్ నుంచి తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.. ఆ తర్వాత ఆర్డినెన్స్‌ ఇవ్వనున్నారు.

    మొత్తంగా 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులోనూ 26 జిల్లాల్లో 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. ప్రస్తుతం 13 జిల్లలు ఉండగా.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

    ఇదీ చదవండి : దగ్గుబాటి రూటు మార్చుకున్నారా..? ఆయన మనసు మార్చుకోడానికి కారణం ఏంటి..?

    ఇక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం.. కుప్పం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాబోతోంది.. దీంతో పాటు పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది రాష్ట్ర కేబినెట్‌.

    ఇదీ చదవండి : మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్టు అధినేత క్లారిటీ..? చంద్రబాబుపై మరో బాణం

    గతంలో చంద్రబాబు నాయుడు.. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ గా చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన విన్నపాన్ని సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని.. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ గా చేసి.. ప్రతిపక్ష నేతకు గిఫ్ట్ ిఇచ్చారు. అయితే హిందూపురం ఎమ్మెల్యే అయితే హిందూపురాన్ని రెవిన్యూ డివిజన్ చేయాలి అంటూ.. ఆందోళనలను చేశారు. అవసరమైతే జగన్ ను కలుస్తానని కూడా చెప్పారు. కానీ తుది డ్రాఫ్ట్ చూస్తే.. బాలయ్యకు నిరాశ తప్పేలా లేదు. మరి ఆయన ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    ఇదీ చదవండి : జనసేనాని పోటీ చేసే ప్లేస్ ఫిక్స్ ..? మరి పవన్ చరిత్రను తిరగరాస్తారా..? చతికిలపడతారా?

    మరోవైపు  ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల అతరణకు ముహూర్తం నిర్ణయించడంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. కొత్త కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల కోసం ఇప్పటికే భవనాల ఎంపిక పూర్తైంది. ఎంపిక చేసిన భవనాల్లో వసతులకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP new districts, AP News

    తదుపరి వార్తలు