Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN ANNOUNCED TWO KEY POSTS IN VISAKHAPATNAM NGS VSP

CM Jagan: వైసీపీ అసంతృప్తులకు సీఎం జగన్ బుజ్జగింపులు.. ఆ ఇద్దరు నేతలకు కీలక పదవులు

సీఎం జగన్ (పాత ఫొటో)

సీఎం జగన్ (పాత ఫొటో)

CM Jagan: తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఎస్ బాస్ అంటారని అంతా అనుకున్నారు.. కానీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తరువాత పరిస్థితి మారింది. వీర విధేయులు అనుకున్నవారే అసమ్మతి గళం వినిపించారు. ఇప్పటికీ కొందరు ఏదో ఒక రూపంలో అధిష్టానానికి తమ అసంతృప్తి తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో ఈ అసమ్మతలకు బుజ్జగింపుల పర్వం మొదలైంది. తాజాగా ఇద్దరు నేతలకు సీఎ జగన్ కీలక పదవులు కట్టబెట్టుతూ ప్రకటన చేశారు.

ఇంకా చదవండి ...
  P Anand Mohan, Visakhapatnam, News18.

  CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార పార్టీలో అసమ్మతి రాగం రోజు రోజుకూ పెరుగుతోంది. రోజుకో నేత తమ అవేదన బహిరంగంగానే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల చేపట్టిన కేబినెట్ విస్తరణ  (Cabinet Reshuffle) సెగలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి కొందరు.. మంత్రి పదవి కొనసాగించలేదనే ఆవేదనతో మరికొందరు.. బహిరంగంగానే నిరసన తెలియచేస్తున్నారు. కొందరు బయట పడకపోయినా.. లోలోనూ మదనపడుతూ.. సమయం కోసం ఎదురుచూస్తున్నారు. పాయకరావుపేట శాసన సభ్యుడు గొల్ల బాబురావు (Golla Baburao) ఉదంతం దీనికి నిదర్శనం. అటు కొందరు మంత్రులు కూడా తమకు కేటాయించిన శాఖల పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) బాధ్యతలను తీసుకోవడానికి కూడా నిరాకరిస్తోన్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanti Srinivas) సైతం కొంత నిరాశతో ఉన్నారని, పార్టీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండట్లేదనే వార్తలు వైఎస్ఆర్సీపీ (YSRCP) లో కలకలం రేపాయి. అనకాపల్లి జిల్లా చోడవరం శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ (Karanam Darmsri) కూడా ఇటీవలే బాహటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం ఇప్పటికైనా ఆ అసంతృప్తిని చల్లారేలా చేయకపోతే.. 2024 ఎన్నికల్లో కష్టాలు తప్పకపోవచ్చు.. అందుకే అధినేత అసమ్మతులపై ఫోకస్ చేశారు.. బుజ్జగింపులను కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్న సీఎం జగన్ (CM Jagan).. ఎయిర్ పోర్టుకు చేరుకోగానే కీలక ప్రకటన చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన నేతకు.. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మరో నేతకు పదవులను ప్రకటించారు.

  విశాఖ (Visakha), అనకాపల్లి (Anakapalli) పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి చెప్పారు అధినేత. ఇటీవల కేబినెట్‌లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలకు ఉపయోగించుకోవాలని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏ పార్లమెంట్ అప్పగించాలన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరినీ విజయవాడకు పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  ఇదీ చదవండి : వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి ఫైర్ బ్రాండ్..! కారణం అదేనా..?

  అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీలను విమానాశ్రయానికి పిలిపించుకుని మరీ అధినేత వారితో మాట్లాడారు. పార్టీలో కీలక పదవులను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తానని స్పష్టం చేశారు. నిరాశ చెందవద్దని, పార్టీకి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ వారిద్దరి సేవలను పార్టీ కోసం వినియోగించుకుంటానని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వారికి వివరించారు. ఈ రెండున్నర సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలపై ఉందని సూచించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan, AP News, Avanti srinivas, Visakhapatnam

  తదుపరి వార్తలు