Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH CM JAGAN AND HIS SISTER SHARMILA DRIVE A TRACTOR AFTER NEXT DAY IN TELANGANA NGS

YS Jagan-sharmila: నిన్న అన్న నేడు చెల్లి.. ఏపీలో జగన్.. తెలంగాణ లో షర్మిల.. ట్రాక్టర్ నడిపి రైతులకు భరోసా

అన్న సీఎం జగన్, చెల్లి షర్మిల పోటా పోటీ ట్రాక్టర్ డ్రైవింగ్

అన్న సీఎం జగన్, చెల్లి షర్మిల పోటా పోటీ ట్రాక్టర్ డ్రైవింగ్

YS Jagan-sharmila: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. నిన్న ఏపీలో ట్రాక్టర్ నడిపి సందడి చేశారు.. తాజాగా చెల్లి షర్మిల కూడా అదే బాట పట్టారు.. స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో భరోసా నింపారు.. అన్నను చెల్లి ఫాలో అవుతున్నారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    YS Jagan-sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటనలోనే నడుస్తున్నారు ఇద్దరు వారసలు.. వేర్వేరు రాష్ట్రాల్లో.. వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నా.. రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ట్రాక్టర్లు నడిపి.. సందడి చేశారు.. నిన్న  వైఎస్సార్ యంత్ర సేవా పథకాన్ని (YSR Yantra Seva Scheme) సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రైతు గ్రూపుతో కలిసి సీఎం స్వయంగా ట్రాక్టర్‌ను నడిపారు. గుంటూరు జిల్లా (Guntur District) లోని చుట్టగుంట దగ్గర 'వైఎస్సార్‌ యంత్ర సేవ పథకం' రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి  (CM Jagan Mohan Reddy) పాల్గొన్నారు. పథకంలో భాగంగా రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీ చేశారు.  ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ కోత యంత్రాల పంపిణీతోపాటు 5,262 రైతు గ్రూపు బ్యాంక్‌ ఖాతాలకు 175.61 కోట్ల రూపాయల సబ్సిడీని వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇలా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఆనందం నింపారు. తాజాగా అన్న బాటలోనే చెల్లి వైఎస్ షర్మిల (YS Sharmila) కూడా నడిచారు.

    ప్రస్తుతం తెలంగాణలో అధికారం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని.. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.. ఇందులో భాగంగానే ఆమె.. ఆమె ట్రాక్టర్ నడిపి రైతులను ఉత్సాహపరిచారు. అయితే ఏపీ సీఎం జగన్ ట్రాక్టర్ నడిపిన మరుచటి రోజే.. అంటే ఒక్క రోజు గ్యాప్ లో అన్నను షర్మిల ఫాలో అవ్వడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అన్నను షర్మిలా ఇలా ఫాలో అవుతున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం షర్మిల ట్రాక్టర్ డ్రైవింగ్ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

    వైయస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా వైరాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడిపారు వైఎస్ షర్మిల. వారందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 'రైతు రాజ్యమే మా లక్ష్యం.. రైతు సంక్షేమమే మా ధ్యేయం.. రైతు బాగు కోసమే మా పోరాటం.. అని రైతులతో అన్నారు.



    ఇదీ చదవండి : పది గ్రేస్ మార్కులను కలపాలి.. విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలని పవన్ డిమాండ్

    రైతుల కోసమే  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందంటూ షర్మిల కాగా, ప్రజాప్రస్థానంలో వైయస్ఆర్‌ను తలుచుకోని గుండె లేదని గుర్తు చేశారు. మంచి మ‌న‌సున్న నాయ‌కుడు మన వైయ‌స్ఆర్. ఆ మ‌హానేత ప‌థ‌కాలు ప్ర‌తి గ‌డ‌ప‌నూ తాకాయని.. అదే లక్ష్యాలతోనే తాను ప్రజలకు సేవ చేయడానికే పార్టీ పెట్టనని షర్మిల వెల్లడించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Telangana, Ycp, YS Sharmila, Ysrtp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు