హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan at Polavaram: వంద కోట్లు ఎక్కువైనా పర్లేదు.. పోలవరంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan at Polavaram: వంద కోట్లు ఎక్కువైనా పర్లేదు.. పోలవరంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు.

ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు.

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) నిర్మాణంపై సీఎ జగన్ (AP CM YS Jagan) సమీక్ష జరిపారు. ఓ వంద కోట్లు ఎక్కువైనా పర్లేదుగానీ నిర్వసితులకు అన్యాయం జరగడానికి వీల్లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. సోమవారం తాడేపల్లి నుంచి నేరుగా పోలవరం చేరుకున్న జగన్ కు హెలిపాడ్ వద్ద పలువురు మంత్రులు, ప్రజాప్రతినిథిలు స్వాగతం పలికారు. అనంతరం వ్యూపాయింట్ నుంచి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అక్కడి నుంచి ఇటీవలే పూర్తైన స్పిల్ వే మీదకు చేరుకున్న సీఎం.. అక్కడి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అనంతరం ప్రాజెక్టు అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రెండేళ్లలో పూర్తైన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల గురించి అధికారులు సీఎంకు వివరించారు. స్పిల్ వే పనులు దాదాపు పూర్తి చేశామన్న అదికారులు.. 48 గేట్లలో 42 గేట్ల అమరిక పూర్తైందని.. మిగిలిన గేట్లను కూడా త్వరలోనే బిగిస్తామని వెల్లడించారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలెండర్లు వచ్చాయని.. ఎగువ కాఫర్ డ్యామ్ లో అంతకుముందున్న ఖాళీలు పూర్తి చేశామన్నారు.

ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులపై అధికారులను సీఎం జగన్ ఆరా తీశారు. కాఫర్ డ్యాంలో ఖాళీల కారణంగా వచ్చిన వరదలకు ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ ప్రాంతం దెబ్బతిందని... దీనిపనులు ఎలా చేయాలన్నదానిపై డిజైన్లు కూడా ఖరారు అవుతాయని అధికారులు సీఎంకు తెలిపారు. 2022 జూన్ నాటికి లైనింగ్‌తో కలుపుకుని రెండు కాల్వలకు లింకు పనులు పూర్తికావాలని, టన్నెల్‌పనులు, లైనింగ్‌పనులు పూర్తికావాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి తవ్వకం పనులు పూర్తవుతాయని, ఆతర్వాత మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.


ఇది చదవండి: నోరూరించే చేపలు, రొయ్యలు, పీతలు ఇకపై మీ ఇంటికే వస్తాయి.. అది ఎలాగంటే..!


పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ పైనా సీఎం జగన్ సమీక్ష జరిపారు. మొత్తం 90 ఆవాసాల్లో ఆగస్టునాటికి 48 ఆవాసాలనుంచి నిర్వాసితులను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎంకు వివరించారు. గతంలో ఆర్ అండ్ ఆర్ పనులను పూర్తిగా పక్కనబెట్టారని.. మన ప్రభుత్వం వచ్చా ఆ పనులపై దృష్టిపెట్టామని.. పనులన్నీ పూర్తి నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఇంతపెద్ద ఎత్తున పునరావాస కాలనీలు కడుతున్నప్పుడు.. సహజంగానే ఎక్కడోచోట అలసత్వం కనిపించే అవకాశాలు ఉంటాయని.., అలాంటి అసత్వానికి తావు ఉండకూడదు, నాణ్యత కచ్చితంగా ఉండాలని సీఎం అన్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల్లో నాణ్యత కచ్చితంగా పాటించేలా ఒక అధికారిని నియమించాలని.. ఆ అధికారి ఇచ్చే ఫీడ్ బ్యాక్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఎంత ఖర్చైనా సరే నాణ్యతలో మాత్రం రాజీపడవద్దని జగన్ స్పష్టం చేశారు.

ఇది చదవండి: భార్యను చంపబోయిన భర్త... 8 నిముషాల్లోనే కాపాడిన దిశ...పునరావాస కాలనీల్లో నిర్వాసితులు జీవితాంతం ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆర్థికంగా రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాసరే... ఆర్‌ అండ్‌ ఆర్‌కు సంబంధించి బిల్లులు ఎక్కడా పెండింగులో పెట్టడంలేదన్న సీఎం జగన్ అన్నారు. ఇకపైకూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ బిల్లులను పెండింగులో పెట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి దాదాపుగా రూ.2300 కోట్లు రావాల్సి ఉన్నా... పనులకు ఎక్కడా ఆటంకం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఇస్తోందన్నారు. కేంద్రం నుంచి బిల్లులు మంజూరు చేయించేందుకు ఒక అధికారిని ఢిల్లీలో ఉంచాలన్నారు.

ఇది చదవండి: తెలిసిన వ్యక్తేకదా అని ఇంటికి వెళ్లింది.. కానీ అతడు అలా చేస్తాడని అస్సలు ఊహించలేకపోయింది..


వచ్చే నెల ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను సందర్శిస్తానని... నిర్వాసితుల జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధిపైనా దృష్టిపెట్టాలని సూచించారు. నిర్వాసితుల్లో ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఉన్నవారికి తిరిగి భూములు ఇచ్చేందుకు భూమిని గుర్తించాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, శ్రీరంగనాథరాజు, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణు, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇది చదవండి: త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎమ్మెల్యే రోజా..? ఆమె కల నెరవేరబోతోందా..?


First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Polavaram