హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Panchayat Elections: సీఎం జగన్ ఎమర్జెన్సీ మీటింగ్.., సుప్రీంకు వెళ్తారా..? ఎన్నికల బరిలో దిగుతారా..?

AP Panchayat Elections: సీఎం జగన్ ఎమర్జెన్సీ మీటింగ్.., సుప్రీంకు వెళ్తారా..? ఎన్నికల బరిలో దిగుతారా..?

ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించలేదు. కరోనా కేసులు తగ్గకపోతే ఏపీలో వీకెండ్ లాక్ డౌన్ అనివార్యమే అనే భావన వ్యక్తమవుతోంది. వారాంతపు లాక్ డౌన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఏపీలో విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించలేదు. కరోనా కేసులు తగ్గకపోతే ఏపీలో వీకెండ్ లాక్ డౌన్ అనివార్యమే అనే భావన వ్యక్తమవుతోంది. వారాంతపు లాక్ డౌన్ కు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) నిర్వహణకు హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) క్యాంప్ ఆఫీస్లోర అత్యవసర భేటీ నిర్వహించారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్లోన అత్యవసర భేటీ నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు సీనియర్ నేతలు హాజరైనట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు అజెండాగా సమావవేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు కరోనాతో సంబంధం లేదని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో తీర్పుపై ఎలా ముందుకెళ్లాలి..? సుప్రీంకోర్టుకు వెళ్లాలా..? లేకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలా..? అనేదానిపై నిశితంగా చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.

  సమావేశంలో ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేసే అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ కు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో సుప్రీం కోర్టులో కౌంటర్ పిటిషన్ వేస్తే వెంటనే విచారణకు స్వీకరిస్తారా..? లేదా అనే అంశంపైనే చర్చిస్తున్నట్లు సమాచారం. ఐతే హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశంపైనా సీఎం జగన్ అభిప్రాయాలు తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల అధికార పార్టీ మద్దతిచ్చే అభ్యర్థులకు ఢోకా ఉండబోదని పలువురు నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. అలాగే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది.

  మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణకు రంగంలోకి దిగుతున్నారు. ద్వారకా తిరుమల చిన వెంకన్నను దర్శించుకున్న అనంతరం విజయవాడ చేరుకున్న ఆయన.., ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో సీఎస్ తో పాటు కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో సమావేశంకానున్నారు. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీల్లో నాలుగు దఫాల్లో ఎన్నికలు నిర్వహించి తీరుతామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.

  ఇక హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఏపీ మంత్రి పినిపే విశ్వరూపం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం భయపడి ఎన్నికల వాయిదా కోరుకోవడం లేదని.., ప్రజారోగ్యం కోసమే వాయిదా కోరుతున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితలలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని., 51శాతం ఓట్లతో 85శాతం సీట్లు వచ్చి తమ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap cm ys jagan mohan reddy, Ap minister perni nani, Cm jagan, Kodali Nani, Nimmagadda Ramesh Kumar, Supreme Court

  ఉత్తమ కథలు