AP POLITICS ANDHRA PRADESH CABINET EXPAND ONLY 5 MINSTERS GET SECOND CHANCE HOMEMINSTER MUST WOMEN WHAT ABOUT OTHERS NGS
Cabinet Reshuffle: మంత్రులుగా కొనసాగేది వీరే.. ఆయనకు కీలక పదవి.. కొత్త ఎమ్మెల్యేలకు ఛాన్స్.. జగన్ ఫార్ములా ఇదే
వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)
Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ లో ఉన్న ఎంతమంది మంత్రులకు రెండో ఛాన్స్ దక్కనుంది.. పార్టీలో కీలక పదవులు చేపట్టనున్న మంత్రులు ఎవరు..? ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారా.. మరోసారి హోం మంత్రిగా మహిళకే అవకాశం ఇవ్వనున్నారా..? కేబినెట్ విస్తరణలో సీఎం జగన్ ఫార్ములా ఇదే.
Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది నాడు కొత్త మంత్రులతో పాలన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రులతో నలుగురైదుగురు తప్పా.. అందరితో రాజీనామాలు చేయించే అవకాశ ఉంది. అది కూడా ఈ నెల 27వ తేదీన రాజీనామాలు కోరనునున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం ఐదుగురుకి మాత్రం మరో ఛాన్స్ ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టుసమాచారం. పనితీరు.. సామాజిక సమీకరణాలు.. ప్రతిపక్షాలకు ధీటైనా సమాధానం చెప్పగల నేతలు.. ఇలా అన్నీ లెక్కలు వేసుకుని.. కేవలం ఐదుగురురిని మాత్రం కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీరిలో
పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డి (Peddireddy Ramachandrareddy), కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని (Perni Nani) లను కొనసాగిస్తారనే ప్రచారం ఉంది. అయితే ఈ ముగ్గురితో పాటు.. బుగ్గన, బాలినేనిలను కడా మంత్రులుగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తాయి. మొదట బొత్సను కూడా మంత్రిగా కొనసాగిస్తారని ప్రచారం జరిగినా.. ఆయనకు మరింత కీలక బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. పార్టీ రీజినల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అలాగే విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)కి మరోసారి కీలక బాధ్యతలు ఇస్తున్నట్టు సమాచారం. విజయవాడలో పార్టీ కేంద్రాలయ కార్యాలయ బాధ్యతలు మొత్తం విజయసాయికి అవకాశం ఇచ్చినట్టు ప్రచారం ఉంది..
జగన్ తన తొలి కేబినెట్ కూర్పు సమీకరణాలనే తిరిగి అమలు చేయనున్నారు. కేబినెట్ కూర్పు లో ఆచితూచి బీసీ - ఎస్సీ - మైనార్టీ కోటాలో అదే సంఖ్యలో మంత్రులు కేబినెట్ లో కొనసాగుతారు. తిరిగి మహిళకే హోం మంత్రి గా అవకాశం దక్కనుంది. అదే విధంగా అయిదు వర్గాల నుంచి అయిదుగురు డిప్యూటీ సీఎంలు సైతం ఉండనున్నారు. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటుతో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కోసం ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని స్వయంగా సీఎం చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా కొందరు మంత్రులను కొనసాగించాల్సి ఉందని స్పష్టం చేసారు. ఇక, ఈ సారి మహిళా మంత్రులుగా మూడు రీజియన్ల నుంచి ముగ్గురికి అవకాశం దక్కనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే ఆయా మహిళా నేతలకు సమాచారం ఇచ్చినట్టు టాక్.
కొత్త జిల్లాల వారీగా పార్టీ అధ్యక్ష పదవులు అప్పగిస్తారనే టాక్ కూడా ఉంది. ప్రధానంగా ఈ సారి బీసీ వర్గాల్లో ఇప్పటి వరకు అవకాశం దక్కని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు.. బీసీ - ఎస్సీ వర్గాలకు ప్రస్తుత కేబినెట్ లో ఉన్న నిష్ఫత్తిలోనే మరోసారి మంత్రి పదవులు కేటాయించే అకాశం ఉంది.
బొత్స విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించి.. రాజ్యసభకు పంపుతారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. కానీ తాజాగా అందుతున్న సోర్స్ ప్రకారం.. ఆయనకు పార్టీ రీజనల్ కమిటీ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఉంది. దీంతో కొత్త కేబినెట్ లో కొనసాగేదెవరు.. కొత్తగా వచ్చేదెవరు ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న మంత్రుల సమీకరణాల ఆధారంగానే కొత్త వారిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచి బీసీ వర్గాలకు ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.