Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH BUDGET SESSION MORE ALLOCATION FOR NAVARATHNALU AND WELFARE SCHEMES NGS GNT

AP Budget 2022: నవరత్నాలతో సంక్షేమ ఫలాలు.. కమ్మ-రెడ్డి-కాపులకు ప్రత్యేక నిధులు.. ఎవరికి ఎంత అంటే..?

అసెంబ్లీలో సీఎం జగన్

అసెంబ్లీలో సీఎం జగన్

AP Budget 2022: ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నట్టు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో సంక్షేమానికి.. నవరత్నాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. ఈ సారి ఎవరూ ఊహించని విధంగా.. కమ్మ-కమ్మ- రెడ్డి- కాపు వర్గాలకు సైతం 2.56 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్ ప్రవేశ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచారు.

ఇంకా చదవండి ...
    AP Budget 2022: సీఎం జగన్ మొదటి నుంచి చెబుతున్నట్టే.. ఏపీ బడ్జెట్ కూడా కనిపించింది. నవరత్నాలు.. సంక్షేమమే తమకు ప్రాధాన్యమని ప్రతిసారి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. తాజాగా బడ్జెట్ కేటాయింపుల్లోనూ అది కనిపించింది. ఆర్ధికంగా ఎన్ని సమస్యలు ఉన్నా.. నిధులు లేకపోయినా.. సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ..సామాజిక వర్గాల వారీగా కేటాయింపులు చేస్తూ.. నవరత్నాల అమలే లక్ష్యంగా ఆర్దిక మంత్రి బుగ్గన శాసనసభలో 2022-23 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే జగన్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందులోనూ బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీ వర్గాలతో పాటుగా ఆర్దికంగా వెనుక బడిన వర్గాలకు భారీగా కేటాయింపులు చేసింది. గతంలో సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన పలు కార్పోరేషన్లను నిధులు కేటాయింపులు చేశారు ఆర్థక మంత్రి బుగ్గన.

    మొత్తం 2,56,256 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. అందులో రెవిన్యూ వ్యయం 2,08,261 కోట్లు కాగా, మూల ధన వ్యవయం 47,996 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఇక రెవిన్యూ లోటు ఎప్పటిలానే భారీగానే ఉంది. 17,036 కోట్లు రెవెన్యూ లోటు ఉందంటూ బుగ్గన చెప్పుకొచ్చారు. అలాగే ద్రవ్య లోటు 48, 724 కోట్లుగా ప్రతిపాదించారు. లోటు.. అప్పులు.. ఖర్చుల సంగతి ఎలా ఉన్నా.. ఆర్థిక మంత్రి మాత్రం సంక్షేమ కేటాయింపులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా బీసీ సంక్షేమానికి 20,962 కోట్ల రూపాయలు, వైఎస్సార్ కాపు నేస్తానికి 500 కోట్ల రూపాయలు, సాంఘిక సంక్షేమం కోసం 12,728 కోట్ల రూపాయలు బడ్జెట్ లో ప్రతిపాదించారు. మరోవైపు మైనార్టీ సంక్షేమం కోసం రూ 1,750 కోట్లు కేటాయించారు. వీరితో పాటుగా ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం 10,201 కోట్ల రూపాయలు కేటాయించినట్టు వెల్లడించారు.

    ఇక నవరత్నాల అమల్లో భాగంగా...వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక 18 వేల కోట్ల రూపాయలు, అదే విధంగా.. వైఎస్సార్‌ రైతు భరోసాకు 3,900 కోట్ల రూపాయలు మంజూరు చేసారు. జగన్న చేదోడు 300 కోట్లు కేటాయిస్తున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో బుగ్గన వెల్లడించారు. నేతన్న హస్తం కోసం 199 కోట్లు ప్రతిపాదించారు. మత్య్సకార భరోసా 120 కోట్లు ప్రతిపాదించారు. ఎస్సీ సబ్ ప్లాన్ 18,518 కోట్లు ప్రతిపాదించారు. బీసీ సబ్ ప్లాన్ 29,143 కోట్లు ప్రతిపాదిస్తూ తమది బీసీ అంటే బ్యాక్ బోన్ అని నమ్మే ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.

    పై కేటాయింపులతో పాటు.. ఈబీసీ సంక్షేమం కోసం 6,639 కోట్లు ప్రతిపాదించారు. మైనార్టీ యాక్షన్ ప్లాన్ 3,532 కోట్లు ప్రతిపాదిస్తుననట్లు బుగ్గన ప్రకటించారు. ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 6,145 కోట్లు ప్రతిపాదించారు. అలాగే నవరత్నాల్లో భాగంగా సీఎం జగన్ మానస పుత్రిక అయిన అమ్మ ఒడికి 6500 కోట్లు ప్రతిపాదించారు. కాపుల సంక్షేమం కింద 3,531 కోట్లు కేటాయిస్తూ బుగ్గన ప్రకటించారు. ఆసరా సంక్షేమం 6400 గా కేటాయించారు. వైఎస్సార్ చేయూత నిర్వహణ కోసం 4235 కోట్లు కేటాయించారు.

    అలాగే సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పోరేషన్ల కు నిధులు ప్రతిపాదించారు. అందులో భాగంగా కమ్మ సంక్షేమం 1,899 కోట్లు, కాగా... రెడ్డి సంక్షేమం 3,088 కోట్లు ప్రతిపాదించారు. వైశ్య సంక్షేమం కోసం 915 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా బుగ్గన ప్రకటించారు. అలాగే క్రిస్టియన్ కార్పెరేషన్ కు 113 కోట్లు కేటాయింపులు చేశారు. అనూహ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ 18,518 కోట్లు ప్రతిపాదిస్తూ బుగ్గన తన ప్రసంగంలో పేర్కొన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ కు కేటాయింపులు చేసారు. ఆ తరువాత విద్యా శాఖ..వ్యవసాయం.. ఇరిగేషన్ శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రోడ్లు భవనాలకు ఈ బడ్జెట్ లో కేటాయింపులు పెరిగాయి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP Assembly, AP Budget 2022, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు