Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) బీజేపీ (BJP) లో ఏం జరుగుతోంది. ఇప్పటికే కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీకి బై బై చెబుతూ.. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju).. ఎంపీ జీవీఎల్ (GVL) తీరు కారణంగానే పార్టీ వీడుతున్నా అంటూ బాంబ్ పేల్చారు. అంతేకాదు కన్నాతో పాటు మరో 15 మందికి పైగా ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేశారు. ఆ ఇష్యూ ముగియక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది.. ఎంపీ జీవీఎల్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.. అదిక పబ్లిక్ గానే.. ఆయన చెప్పిన మాటలను షేర్ చేస్తూ.. దానికి కౌంటర్ గా ట్వీట్ చేశారు.. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది.. పార్టీలో కొందరి నేతలకు నిజంగానే జీవీఎల్ తీరు నచ్చడం లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతకీ పురందేశ్వరి కౌంటర్ ఏమిచ్చారంటే..? "అన్నీ ఇద్దరి పేర్లేనా" అన్న జీవీఎల్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ.. ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం-- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే, మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు అంటూ పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.
"అన్నీ ఇద్దరి పేర్లేనా"
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం-- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1 — Daggubati Purandeswari ???????? (@PurandeswariBJP) February 17, 2023
అసలు జీవీఎల్ ఏమన్నారంటే..? సోము వీర్రాజుపైనా.. తనపైనా కన్నా వ్యాఖ్యలుకు వ్యతిరేకంగా స్పందించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు వెంటనే రాష్ట్ర బాధ్యతలు అప్పగించిందన్నారు. కానీ కన్నా విషయంలో అలా జరగలేదన్నారు. ఆయనకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్ని అధిష్టానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జాతీయ కార్యవర్గంలోకి తీసుకుందని జీవీఎల్ గుర్తు చేశారు.
ఇదీ చదవండి : జనసేన అన్నారు.. టీడీపీ వైపు వెళ్తున్నారా..? అసలు కారణం ఇదే..?
కాపుల రిజర్వేషన్, అలాగే వంగవీటి మోహన్‌రంగా పేరుకు సంబంధించి తనపై కన్నా విమర్శలకు స్పందించనని ఆయన తేల్చి చెప్పారు. అయితే రాష్ట్రంలో చాలా కాలంగా అన్నింటికీ ఆ ఇద్దరు పేర్లే కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.. ఎన్టీఆర్ , వైఎస్ఆర్ లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఆ ఇద్దరితోనే రంగాను పోల్చారు.. దీంతో పురందశ్వరి ఇలా ట్విట్టర్ వేదికగా స్పందించారు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, AP Politics, GVL Narasimha Rao, Purandeswari