హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Somu Veerraju: మరీ ఇంత దారుణమా..? కేంద్రం బియ్యాన్ని అమ్ముకుంటారా..? ఏపీ సర్కార్ పై సోమువీర్రాజు ఫైర్

Somu Veerraju: మరీ ఇంత దారుణమా..? కేంద్రం బియ్యాన్ని అమ్ముకుంటారా..? ఏపీ సర్కార్ పై సోమువీర్రాజు ఫైర్

సోము వీర్రాజు

సోము వీర్రాజు

Somu Veerraju: తమ్ముడు.. తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెత ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో.. బీజేపీకి వైసీపీ ఫుల్ సపోర్ట్ చేసింది. ఆ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించిన.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. తాజాగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు..

ఇంకా చదవండి ...

  Somu Veerraju: ఒకప్పుడు అధికార వైసీపీ (YCP) అనుకూలంగా వ్యాఖ్యలు చేసే.. సోము వీర్రాజు ( Somu Veerraju) ఇటీవల రూటు మార్చారు. జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. చిన్న అవకాశం వచ్చినా.. పానలపై విరుచుకుపడుతున్నారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల (President Elections) విషయంలో వైసీపీ (YCP) సహాయం.. బీజేపీకి తప్పనిసరై అయ్యింది.. కేంద్ర బీజేపీ పెద్దలు స్వయంగా సీఎం జగన్ (CM Jagan) ను కోరవడంతో.. ఆడిగిందే ఆలస్యం అన్నట్టు జగన్ ఒకే చెప్పారు.. దీంతో సీఎం జగన్ నిర్ణయంపై సోము వీర్రాజు పొగడ్తలు కురిపించారు. స్వయంటా ముర్ము వచ్చి కూడా జగన్ కు.. పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.. ఇలా నిన్నటి వరకు జగన్ ను పొడిగి ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. ఇప్పుడు రూటు మార్చాడు.. ఏపీ సర్కార్‌ (AP Government) పై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం సరఫరా చేసే ఉచిత బియ్యం రాష్ట్రం అందించట్లేదని ఆరోపించిన ఆయన.. నాలుగు నెలలుగా బియ్యం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన వివరణ ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు..

  కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్రం పంపిణీ చేయడంలేదంటూ బీజేపీ కార్యాలయం దగ్గర ఆయన నిరసనకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం దిగిరకపోతే 18వ తేదీన అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇంకా ప్రభుత్వం దిగిరకపోతే ఉద్యమం దిగువ స్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తున్న బియ్యాన్ని రాష్ట్రం అమ్మేసుకుంటుందని.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై సరైన వివరణ ఇవ్వట్లేదని మండిపడ్డారు.. ఇక, కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్రం వాడేసుకుంటుందని ఆరోపించారు సోము వీర్రాజు.

  ప్రజలు వైసీపీ నాయకులను బియ్యం ఇవ్వట్లేదు అని అడిగితే.. అసత్యాలు ప్రసారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ఇవ్వట్లేదు అని అబద్ధాలు చెప్పడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వైసీపీ చేస్తున్నఆరోపణల్లో అసలు నిజం లేదన్నారు సోము వీర్రాజు.. కేజీ బియ్యానికి రాష్ట్రం ఇచ్చేది 2 రూపాయాలైతే.. కేంద్రం 38.45 రూపాయలు ఇస్తుందని వివరణ ఇచ్చారు. పేదలకు బియ్యం ఇవ్వకుండా బియ్యం అమ్మేసుకునే వాళ్లకు ఇస్తున్నారని ఆరోపించారు.

  ఇదీ చదవండి : ముర్ముకు టీడీపీ మద్దతుకు కారణం అదే.. చంద్రబాబును విపక్షాలు ఎందుకు పిలవలేదంటే? యశ్వంత్ ఆసక్తికర కామెంట్స్

  ఎన్నో ఏళ్ల నుంచి కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం ఎగుమతి అయిపోతుందన్నారు. ఏపీలో సర్కార్ కు తెలిసే పెద్ద మోసం జరుగుతోంది అన్నారు. జగన్ ప్రభుత్వం మిల్లర్ల ప్రభుత్వమని.. అందుకే మిల్లర్ల చేత రైతుల నుంచి తక్కువకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సీఎం వైఎస్‌ జగన్‌కు దమ్ముంటే, నిజాయితీ వుంటే సివిల్ సప్లై ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. పేదవాళ్లను మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు మోసం చేస్తున్నారని... కేంద్రం గ్రామీణ అభివృద్ధికి సర్పంచ్ ల అకౌంట్లలలో డబ్బులు వేస్తుంటే ఇప్పటికి రిలీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలతో దయచేసి రాష్ట్రాన్ని దివాళా తియించొద్దు అని సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Somu veerraju

  ఉత్తమ కథలు