హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Assembly: రెండు కీలక తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

AP Assembly: రెండు కీలక తీర్మానాలకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్ (ఫైల్ ఫోటో)

YS Jagan: తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారని సీఎం జగన్ గుర్తు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రెండు కీలక తీర్మానాలను ఆమోదించారు. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం చేయగా.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన 2 తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నామని సీఎం జగన్ తెలిపారు. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారని సీఎం జగన్ గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేశామని అన్నారు. రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్‌ తెలుసుకుందని.. ప్రభుత్వానికి నివేదిక అందించిందని అన్నారు.

కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదని అన్నారు. కొందరు దీనిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఎస్టీలు తనను గుండెల్లో పెట్టుకున్నారని.. వారిని తాను కూడా అలాగే గుండెల్లో పెట్టుకుంటానని సీఎం జగన్ అన్నారు. ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండబోదని, గిట్టని వారే ఓట్ల కోసం దీనిపై తప్పుడ ప్రచారం చేస్తున్నారని అన్నారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని.. ఉమ్మడి ఏపీలో దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ హయాంలో తీర్మానం జరిగిందని..మళ్లీ ఇప్పుడు తాము తీర్మానం చేస్తున్నామని అన్నారు. మతం మారినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు మారవని సీఎం జగన్ అన్నారు.

దేవుడి కోసం పిడకల సమరం..! వందల ఏళ్ల సాంప్రదాయం

Ramzan: రంజాన్ మాసం ప్రారంభం.. మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు

దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలన్న తీర్మానాన్ని మంత్రి మేరుగు నాగార్జున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం తమది అని చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారని ఆయన ఆరోపించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు