Golden Temple: ప్రస్తుతం బంగాళాఖాతం (Bay of Bengal) లో అసని తుపాను (Asani Cyclone Effet) అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో తీరప్రాంతాలన్నీ అలజడిగా మారాయి. పలుచోట్ల భారీవర్షాలు పడ్డాయి.. పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సముద్రతీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను ప్రభావానికి తీరప్రాంతమంతా అలజడిగా మారింది. ఇలాంటి సమయంతో ఓ సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లో ఓ వింత రధం కొట్టుకువచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో తీరప్రాంతాలన్నీ అలజడిగా మారాయి. పలుచోట్ల భారీవర్షాలు పడ్డాయి.. పడుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సముద్రతీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను ప్రభావానికి తీరప్రాంతమంతా అలజడిగా మారింది. ఇలాంటి సమయంతో ఓ సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది.
అది చూడటానికి బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతోంది. సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఆ రథం విదేశానికి చెందినగా భావిస్తున్నారు. ఈ వింతైన రథాన్ని చూసేందుకు అక్కడి ప్రాంతవాసులు భారీగా తరలివస్తున్నారు. కొట్టుకువచ్చిన వింతైన ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో పెను తుపానులు వచ్చాయని, ఎప్పుడూ కూడా ఇలాంటి రథం వంటి వింతైనవి కొట్టుకురాలేదంటున్నారు. ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ బంగారు రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ రథం ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : పవన్ దేవుడా..? లేక జ్యోతిష్యుడా..? దమ్ముంటే సింగిల్ గా రావాలి అంటూ రోజా సవాల్
ఒ వైపు అసని తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వివిధ రకాల ఏర్పాట్లు చేసారు. కలెక్టర్లు, సంబంధిత జిల్లాల మంత్రులు తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని, తీరం దాటిన తరువాత బాధితులకు సరైన ఆహారం, నీళ్లు అందించే దిశగా చర్యలు తీసుకున్నారు. ఇంతలోఈ బంగారు మందరి దర్శనం ఇచ్చింది.
ఇదీ చదవండి : చంద్రబాబును జైలుకు పంపే ప్రయత్నాలు మొదలయ్యాయా? ఇదే సరైన సమయమా? కారణం ఇదే?
మరోవైపు ఆసని తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారి బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా మారి బలహీన పడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 60 కిలోమీటర్లు, కాకినాడకు 180 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 310 కిలోమీటర్లు, గోపాలపూర్ కు 550 కిలోమీటర్లు, పూరీకి 630 కిలోమీర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం వుందంటోంది వాతావరణ శాఖ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Cyclone alert, Srikakulam