Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESH 10TH CLASS PAPER LEAKED BEHIND CORPORATE MAFIA HANDS SHOCKING FACTS NGS

10th Exam Paper Leak: పేపర్ లీకుల వెనుక కార్పొరేట్ లీలలు.. వాస్తవాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఏపీ టెన్త్ పరీక్షల్లో హిందీ పేపర్ లీక్..?

ఏపీ టెన్త్ పరీక్షల్లో హిందీ పేపర్ లీక్..?

AP 10th Class Paper Leak: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పేపర్ల లీకులు వ్యవహారం కలకలం రేపుతోంది. కొన్ని జిల్లాల్లో విషయం బయటకు రాకపోయినా.. దాదాపు చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందని సమాచారం. అయితే ఈ లీకుల వెనుక కార్పొరేట్ లీలలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    AP 10th Exams paper leaked:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షల (AP SSC Exams-2022) సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం ఆగడం లేదు.  ప్రతి రోజూ పేపర్ ఎక్కడో ఒక చోట పేపర్ లీక్ అవ్వడం సంచలనంగా మారుతోంది. పరీక్షల తొలిరోజు చిత్తూరు జిల్లా (Chittoor District) లో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఐతే ఆ వార్తలు అవాస్తవమని మంత్రులు చెబుతున్నారు.  ఐతే పరీక్షల రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సరబుజ్జిలి మండలం రొట్టవలస పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ అయినట్లు వదంతులు వస్తున్నాయి. పరీక్ష ప్రారమైన కాసేపటి తర్వాత ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపిచినట్లు తెలియడంతో అధికారులు  విచారణ ప్రారంభించారు.

    తాజాగా చిత్తూరు జిల్లా టెన్త్ క్లాస్ పేపర్ మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో 7 మంది నిందితులను అరెస్టు చేసినట్లు అనంతపురం రేంజ్ డీఐజీ రవి ప్రకాష్ శుక్రవారం వివరించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్ కేసులో కార్పొరేట్ కళాశాల ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమనిస్తున్నారు. అడ్మిషన్లను పెంచుకునేందుకే పలు కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయని తెలుస్తోంది. పవన్ కుమార్ అనే టీచర్ మాల్ ప్రాక్టీస్ (mall practice) లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పరీక్షా పత్రాలను సెల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా కార్పొరేట్ కళాశాల ప్రతినిధులకు పంపినట్టు గుర్తించారు.

    ఇదీ చదవండి : ఏపీ సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వర రావు.. ఏం చెప్పారంటే..?

    పరీక్షల ప్రారంభానికి ముందు ఎక్కడా క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదు. మాల్ ప్రాక్టీస్ మాత్రమే జరిగిందని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. ఎది ఏమైనా ఈ వ్యవహారంతో సంబంధమున్న ఎవరినీ వదిలిపెట్టం. కార్పొరేట్ కళాశాలలన్నీ కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారానికి తెరతీశాయి. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగమున్న ఎవరైనా ఉపేక్షించబోమని డీఐజీ రవి ప్రకాష్ స్పష్టం చేశారు. అయితే ఈ పేపర్ల లీక్ విషయంలో తొలి రోజు నుంచి విమర్శలు వస్తున్నా..? ప్రభుత్వం పేపర్ లీక్ అవ్వలేదని చెప్పే మంత్రులు చెప్పే ప్రయత్నం చేశారు తప్పా.. వాస్తవాలను ఒప్పుకోలేదు.

    ఇదీ చదవండి :: సీఎం జగన్ కు వచ్చిన మార్కులు ఎన్ని..? సర్వేల్లో అసలు నిజం ఎంత..? వారిపై వేటు తప్పదా..?

    అయితే తాజాగా ఏపీలో టెన్త్‌ ఎగ్జామ్‌ క్వశ్చన్‌ పేపర్ల లీకుల వ్యవహారం కలకలం కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ పేపర్లన్నీ పరీక్షలు ప్రారంభమైన గంటకు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. పలువురు టీచర్లను అరెస్ట్‌ చేశారు. లోతుగా విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గుతేల్చి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యామంత్రి ఈ రోజు తెలిపారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: 10th Class Exams, Andhra Pradesh, AP News, Chitoor, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు