Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADESB POLITICAL NEWS BJP NATIONAL PRESIDENT JP NADDA WILL GAVE CLARITY BJP TDP ALLIANCE NGS

BJP Focus on AP: టీడీపీతో బీజేపీ పొత్తు..! తేల్చి చెప్పనున్న బీజేపీ జాతీయ అధిష్టానం.. ఏపీకి నడ్డా..?

బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (Image; BJP

BJP Focus on AP: ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ రానుందా..? టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. ఇక తేల్చాల్సింది.. బీజేపీ మాత్రమే..? అందుకే ఈ పొత్తులపై బీజేపీ తేల్చాయాలి అనుకుంటోందా..? కేవలం జనసేనతోనే వెళ్లాలి అనుకుంటోందా..? టీడీపీని కలుపుకునే ప్రయత్నం చేస్తుందా.. ఈ ప్రశ్నలకు బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది..?

ఇంకా చదవండి ...
  BJP Focus on AP: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎలక్షన్ హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా విపక్షాల పొత్తులపై రోజు రోజుకు ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు దేశం (Telugu Desam), జనసేన (Janasena) పొత్తు దాదాపు ఖరారైనట్టే ప్రచారం ఉంది. ఆ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకే అభిప్రాయంలో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేదుకు పొత్తుల అవసరం ఎంతైనా ఉందని.. బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఏపీ బీజేపీ (AP BJP) నేతలు మాత్రం.. కేవలం జనసేన -బీజేపీ పొత్తు మాత్రమే ఉంటుందని.. మూడో పార్టీ ప్రస్తావనే ఉండదు అంటున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు అంటున్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Verrajju).. కుటుంబ, అవినీతి పార్టీలతో తాము పొత్తు పెట్టుకోము అంటూ ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో జనసేనతో పొత్తు ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. అటు పవన్ వ్యాఖ్యలు చూస్తే.. ఆయన టీడీపీతో వెళ్లే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు.. మరో ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే టీడీపీతో పొత్తుపై సుముఖంగా లేరని.. ఇతర నేతలంతా టీడీపీతో కలిసి వెళ్తేనే మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నట్టు టాక్ ఉంది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అధిష్టానానికి నివేదికలు పంపినట్టు కూడా టాక్..

  తాజా పరిస్థితులు.. ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాల నేపథ్యంలో.. తెలంగాణ (Telangana)తో పాటు.. ఆంధ్రప్రదేశ్ పైనా బీజజేపీ జాతీయ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో ఎన్నికలకు సిద్దమని ప్రకటించారు. పార్టీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ లక్ష్యంగా పదునైన విమర్శలతో రాజకీయ యుద్దానికి సమర శంఖం పూరించారు. ఇక ఏపీలో భవిష్యత్ కార్యాచరణ పైన ఫోకస్ పెట్టారు. అయితే ఏపీలో బీజేపీ కి మిత్రపక్షంగా ఉన్న జనసేన-టీడీపీతో పొత్తుకు సిద్దం అయిందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

  ఇదీ చదవండి : తల్లుల ఖాతాల్లో డబ్బులు పడేది ఎప్పుడంటే..? అమ్మ ఒడికి కొత్త అర్హతలు ఇవే..

  ఇటు పవన్ కళ్యాణ్ మత్రం అద్భుతం జరిగే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో బీజేపీని సైతం ఒప్పించి... టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పటం ద్వారా పవన్ ఆలోచనలు ఏంటనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు.

  ఇదీ చదవండి : : అచ్చం వెంకటేశ్వర స్వామిలానే ఉన్నారే..? నటుడు కాదు..? ఈ ఎంపీని గుర్తు పట్టారా..?

  జూన్ 5,6 తేదీల్లో ఏపీ నడ్డా పర్యటించనున్నారు. ప్రతీ అయిదు పోలింగ్ కేంద్రాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసుకున్న శక్తి కేంద్రాల ఇన్ ఛార్జ్ లతో నడ్డా సమావేశం కానున్నారు. జూన్ ఐదో తేదీన రాజమండ్రిలో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొంటారు. 6వ తేదీన విజయవాడలో పార్టీ కీలక నేతల సమావేశంలోనూ ఆయన పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో టీడీపీతో పొత్తు అంశం పైన రాష్ట్ర పార్టీ నేతలను క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, JP Nadda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు