Home /News /andhra-pradesh /

AP POLITICS ANDHRA PRADES BJP CHIEF SAYS WE ARE READY FOR CONTEST IN ATMAKUR BY POLL WHAT IS TDP AND JANASENA STAND NGS

AP Politics: ఆత్మకూరు ఏకగ్రీవం కాదా..? పోటీకి సై అన్న బీజేపీ.. బరిలో మరో అభ్యర్థి

సోము వీర్రాజు (ఫైల్)

సోము వీర్రాజు (ఫైల్)

AP BJP: ఆత్మకూరు ఉప ఎన్నిక తప్పేట్టు లేదు.. ఇప్పటికే జాతీయ బీజేపీ సైతం ఎన్నికను ఏక గ్రీవం కానివ్వము అంటోంది. బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. మరోవైపు మేకపాటు కుటుంభ సభ్యుడు సైతం బరిలో దిగేందుకు సై అంటున్నారు.

  AP Politics: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు జిల్లా (Nellore District) ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక్కడ మేకపాటి కుటుంబానికే మళ్లీ సీటు ఇవ్వాలని అధినేత జగన్ నిర్ణయించారు. అయితే మేకపాటి కుటుంబం నుంచి ఎవరైనా ఎన్నికల బరిలో ఉంటే ఏకగ్రీవం అవుతుందని అంతా భావించారు. ముఖ్యంగా మేకపాటి గౌతమ్ రెడ్డికి పెద్దగా శత్రువులు లేదు. సౌమ్యుడిగా ఆయనకు పేరుంది. అలాగే ఆయన అన్ని పార్టీల్లో నేతలతో స్నేహంగా ఉంటారు. ఆయన ఇమేజ్ ప్రకారం ప్రధాన పార్టీలు పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వివాద రహితుడిగా పేరున్న ఆయన.. అతి చిన్న వయసులోనే చనిపోయారు. దీంతో ఆ సీటు పక్కగా ఏక గ్రీవం అవుతుందని అంతా భావించారు. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆయన్ను అజాత శత్రువుగా కీర్తిస్తూ అన్ని పార్టీల నేతలు నివాళులర్పించారు. గౌతమ్ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు. దాదాపుగా అన్ని పార్టీల నేతలు గౌతమ్ తండ్రి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డిని కలిశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు.

  దివంగత నేతకు ఉన్న ఇమేజ్ తో.. ఎన్నికలు వచ్చినా గౌతమ్ రెడ్డి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే.. పోటీకి ఎవరూ సిద్ధపడకపోవచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా మేకపాటికి పోటీదారు బయటకొచ్చారు. ఆయన ఇంకెవరో కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. పేరు బిజివేముల రవీంద్రా రెడ్డి. అయితే ఆయన ఇప్పటి వరకూ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం బీజేపీ నేతను అని చెప్పుకుంటున్నారు. మేకపాటి కుటుంబ సభ్యులపై ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కుదిరితే బీజేపీ టికెట్ పై పోటీ చేస్తాను, లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానన్నారు.

  ఇదీ చదవండి: మహిళ కమిషన్ ముందు చంద్రబాబు హాజరవుతారా..? అసలు కేసు ఏంటంటే..?

  బిజివేముల రవీంద్రా రెడ్డి అనే సదరు నాయకుడు బీజేపీ తరపున పోటీ చేసినా, ఇండిపెండెంట్ గా బరిలో దిగినా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయనకు వచ్చే ఓట్లు ఎన్నో ఆయనకే తెలియదు. బీజేపీ ఇక్కడ అభ్యర్థి కోసం వెదుకుతున్నా.. స్థానికంగా తమ పేరు చెడగొట్టుకోవాలని ఎవరికీ లేదు. అందుకే పోటీకి వెనకాడుతున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈ సమయంలో వారికి బిజివేముల దొరికారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) సైతం ఆత్మకూరు ఎన్నికపై కీలక ప్రకటన చేశారు.

  ఇదీ చదవండి : బియ్యానికి నగదు బదిలీ వాయిదా..? కారణమేంటో తెలుసా..?

  ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన 2.3 లక్షల పోస్టుల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతికి పోలీసు శాఖ అండగా నిలుస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, AP News, AP Politics, Somu veerraju

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు