Home /News /andhra-pradesh /

AP POLITICS AMARAVATI FARMERS PLANNING TO START ANOTHER PADAYATRA TO NORTH ANDHRA DISTRICT FULL DETAILS HERE PRN GNT

Amaravati: మరో ఉద్యమానికి అమరావతి రైతులు సిద్ధం.. ఈసారి ఉత్తరాంధ్రపై ఫోకస్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు మూడు రాజధానులు (AP 3 Capitals) నిర్మిస్తామని వైసీపీ (YSRCP) ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధాని అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు

 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India
  Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు మూడు రాజధానులు (AP 3 Capitals) నిర్మిస్తామని వైసీపీ (YSRCP) ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధాని అంశం తీవ్ర వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. ఓ దశలో అమరావతి ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో రైతులపై పోలీసులను ప్రయోగించాల్సి వచ్చింది. ఐతే రాజధాని కోసం భూములిచ్చిన తమకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ రైతులు కోర్టును ఆశ్రయించారు. అంతేకాదు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లును వెనక్కి తీసుకున్నా.. మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని ప్రకటించడంతో రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తన్నారు. మరోవైపు కోర్టు కూడా అమరావతికి అనూలంగా తీర్పునిచ్చింది. ఐతే ప్రభుత్వ వైఖరిపై గుర్రుగా ఉన్న అమరావతి ప్రాంత రైతులు ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతున్నారు.

  అమరావతి రైతుల ఉద్యమం వెయ్యి రోజులకు చేరుతున్నందున అమరావతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాదు అమరావతికి అన్ని ప్రాంతాల మద్దతు కూడగట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రజలతో అమరావతికి జై కొట్టించేందుకు అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణను అమరావతి జేఏసీ ప్రకటించనుంది.

  ఇది చదవండి: జనసేనలో చేరనున్న ప్రముఖ స్వామిజీ..? ఆ నియోజకవర్గంపై కన్ను..?


  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోదీతో అట్టహాసంగా శంఖుస్థాపన చేయించింది. శాసనసభ, సెక్రటేరియట్,హైకోర్టు వంటి కొన్ని పరిపాలన భవనాలను నిర్మించి అక్కడి నుండే పరిపాలన కొనసాగించారు. అప్పట్లో వేలకొట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని అనేక హంగులతో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఊదరగొట్టారు. ఐతే నిధులలేమితో అమరావతి నిర్మాణం మందకొడిగా సాగింది. ఐదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తిస్థాయిలో రాజధానిని రూపొందించలేకపోయారు.

  ఇది చదవండి: ఆ నెల రోజులు తిరమలకు రాకపోవడమే మంచిది.. భక్తులకు టీటీడీ కీలక సూచన.. కారణం ఇదే..!


  ఐతే 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్ధిక పరమైన అంశాలు, అప్పటి అధికార టీడీపీ వర్గాలు ముందే ఆప్రాంతంలో వేల ఎకరాలు కొనుగోలుచేసి ఇన్ సైడర్ ట్రైడింగ్ కు పాల్పడిందని, వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వ పెద్దలు పేదల నుండి లాగేసుకుని వారికి అన్యాయం చేశారనే విషయాన్ని సాకుగా చూపి అమరావతి నిర్మాణం అసాధ్యం అంటూ మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

  ఇది చదవండి: వైజాగ్ బీచ్ లో షాకింగ్ సీన్.., నల్లగా మారిన ఇసుక.. కారణం ఇదేనా..?


  ఐతే అప్పటి వరకు తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మి దాదాపు 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చామని, సీఎం జగన్ మోసం చేశారంటూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. ఇక్కడే రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు ఉద్యమ బాట పట్టారు. వీరికి రాష్ట్రంలో ఒక్క వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.  ఇప్పుడు కూడా అమరావతి నుండి అరసవెల్లి పాదయాత్రకు అన్ని పార్టీ ల మద్దతును కూడగడుతున్నామని ఈ యాత్ర వెంకటపాలెం వెంకన్న గుడి వద్ద నుండి సెప్టెంబర్ 12 ప్రారంభమవుతుదని ఉమ్మడి కృష్ణ జిల్లా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా అరసవెల్లిలో ముగియనుందట. దాదాపు 650 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని రాజధాని రైతులు చెబుతున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Amaravati, Andhra Pradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు