హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: సీఎం, మంత్రులను శిక్షించాల్సిందే.. ఏపీ సర్కార్ ను వదలని రైతులు.. కోర్టులో పిటిషన్..!

YS Jagan: సీఎం, మంత్రులను శిక్షించాల్సిందే.. ఏపీ సర్కార్ ను వదలని రైతులు.. కోర్టులో పిటిషన్..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ప్రభుత్వంపై న్యాయపోరాటం వియంలో రాజధాని అమరావతి (Amaravati) రైతులు ఎక్కడా తగ్గడం లేదు. రాజధాని (AP Capital Issue) పనులు ప్రారంభించాలని హైకోర్టు (AP High Court) ప్రభుత్వాన్ని ఆదేశించినా అమలు ప్రభుత్వం ఇంతవరకు నిర్మాణాలను చేపట్టకపోవడంపై రైతులు కోర్టుకు వెళ్లారు.

ఇంకా చదవండి ...

ప్రభుత్వంపై న్యాయపోరాటం వియంలో రాజధాని అమరావతి (Amaravati) రైతులు ఎక్కడా తగ్గడం లేదు. రాజధాని (AP Capital Issue) పనులు ప్రారంభించాలని హైకోర్టు (AP High Court) ప్రభుత్వాన్ని ఆదేశించినా అమలు ప్రభుత్వం ఇంతవరకు నిర్మాణాలను చేపట్టకపోవడంపై రైతులు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదంటూ రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. అధికారులు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అప్పటి న్యాయకార్యదర్శి సునీత, శాసనసభ సెక్రటరీ బాలకృష్ణమాచార్యులు, అప్పడి ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ ఎస్ఎస్ రావత్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మీతో పాటు సీఎం జగన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

అమరావతిని నిర్మించాలని, అక్కడ కనీస సౌకర్యాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని, రైతులకు నెలరోజుల్లో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించాలని మార్చి3వ తేదీన హైకోర్టు తీర్పునిచ్చింది. ఐతే ఏప్రిల్ 2లోపు రైతులకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు సీఆర్డీఏ చర్యలు తీసుకున్నా రైతులు మాత్రం అభ్యంతరం తెలిపారు. కోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిచిందిని.. కోర్టు ధిక్కరణ కింద సీఎంతో పాటు మంత్రులు, అధికారులను శిక్షించాలని రైతులు కోర్టును కోరారు.

ఇది చదవండి: తిరుమల శ్రీవారి భక్తులకు షాక్.. ఆలయం వద్ద ఊహించని పరిణామం..


మరోవైపు రాజదాని నిర్మాణానికి 60 నెలల సమయం కావాలంటూ ప్రభుత్వం తరపున సీఎస్ దాఖలు చేసిన అఫిడవిట్ ను కొట్టివేయాలని రైతులు కౌంటర్ దాఖలు చేశారు. అమరావతి నిర్మాణానికి అనుకూలంగా లేమని సీఎస్ అఫిడవిట్ ను పేర్కొన్నట్లు స్పష్టమవుతుందన్నారు. కోర్టు ధిక్కరణ కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ అఫిడవిట్ దాఖలు చేశారని.. కోర్టు తీర్పును అపహాస్యం చేసేలా ప్రభుత్వం తీరుందని రైతులు ఆరోపించారు. కోర్టు తీర్పు తర్వాత కూడా పలువురు మంత్రులు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెప్పడం ధిక్కరణ కిందకే వస్తుందని రైతులు పేర్కొన్నారు.

ఇది చదవండి: కాంగ్రెస్ తో దోస్తీ జగన్ కు కలిసొస్తుందా..? ఈ ప్లాన్ చంద్రబాబుకు లాభమా..? నష్టమా..?


మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు గత ఏడాది అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాజధానిపై రైతులు వేసిన పిటిషన్లపై విచారణ అవసరం లేదని ప్రభుత్వం కోర్టకు తెలిపింది. మరోసారి సమగ్రమైన బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని... మూడు మూడు రాజధానులే తమ విధానమని ప్రకటించారు. ఐతే రైతుల పిటిషన్లపై విచారణను పూర్తి చేసిన కోర్టు రాజధానిని అమరావతిలోని నిర్మించాలని స్పష్టం చేసింది.

ఇది చదవండి: మారనున్న చంద్రబాబు అడ్రస్.. ఇకపై అక్కడి నుంచే రాజకీయం.. కారణం ఇదేనా..?


ఇదిలా ఉంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజధానిపై చర్చించిన ప్రభుత్వం.. అన్ని వర్గాల సమాన అభివృద్ధికి మూడు రాజధానులే అవసరమని, అనివార్యమని, అదే తమ విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు పాలనా వ్యావస్థలో కోర్టులు ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నాయని చర్చలో స్పీకర్ తో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైతులు సీఎంతో పాటు మంత్రులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

First published:

Tags: Amaravathi, Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP High Court

ఉత్తమ కథలు