హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Supreme Court: సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రగడ..అన్ని కేసులపై నేడు విచారణ

Supreme Court: సుప్రీంకోర్టుకు అమరావతి రాజధాని రగడ..అన్ని కేసులపై నేడు విచారణ

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో అమరావతి రాజధాని కేసు విచారణ జరగనుంది. రాజధాని కేసుతో పాటే రాష్ట్ర విభజనకు సంబంధించి దాఖలైన 35 కేసుల అన్నింటిపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. ఏపీ రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని హైకోర్టు  (High Court) తీర్పునిచ్చింది. హైకోర్టు  (High Court) తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. ఏపీ హైకోర్టు (Ap High Court) తీర్పుపై స్టే విధించాలని, రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సరికాదని ఆ పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ కేసులకు సంబంధించి జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో అమరావతి రాజధాని కేసు విచారణ జరగనుంది. రాజధాని కేసుతో పాటే రాష్ట్ర విభజనకు సంబంధించి దాఖలైన 35 కేసుల అన్నింటిపై నేడు దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది. ఏపీ రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని హైకోర్టు  (High Court) తీర్పునిచ్చింది. హైకోర్టు  (High Court) తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. ఏపీ హైకోర్టు (Ap High Court) తీర్పుపై స్టే విధించాలని, రద్దు చేసిన చట్టాలపై తీర్పు ఇవ్వడం సరికాదని ఆ పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ కేసులకు సంబంధించి జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషీకేశ్ రాయితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

Suryakumar Yadav : బీసీసీఐ సంచలన నిర్ణయం.. రోహిత్, కోహ్లీలతో పాటు టీ20ల నుంచి సూర్యకుమార్ ఔట్!

రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు తమ తమ అధికార పరిధిల్లో పని చేయాలి. శాసన, పాలనా వ్యవస్థ అధికారంలోకి న్యాయవ్యవస్థ చొరబడడం రాజ్యాంగ మౌలిక వ్యవస్థకు విరుద్ధం. తమ రాజధానిని రాష్ట్రాలే నిర్ణయించుకోవడం అనేది సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమని పిటీషన్ లో ప్రభుత్వం పేర్కొంది. రాజధానిపై శివరామ కృష్ణన్ (Shivarama krishnan)  కమిటీ నివేదిక, జిఎస్ రావు (Gs Rao) కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (Bostan Consulting Group) నివేదిక, హైపవర్డ్ (High powerd)  కమిటీ నివేదికలను హైకోర్టు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్యా రాజధానిని అమరావతిని కేంద్రికృతం చేయకుండా..వికేంద్రీకరణ చేయాలని నివేదికలు చెబుతున్నాయి. తమ రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. ఒకే రాజధాని ఉండాలని, ఏపీ (Andhra Pradesh) విభజన చట్టంలో లేనప్పటికీ, చట్టానికి తప్పుడు అర్ధాలు చెబుతున్నారని పిటీషన్ లో పేర్కొన్నారు.

కాగా గత కొన్ని రోజులుగా అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని రైతులు మహాపాదయాత్ర చేపట్టారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణ జరిగింది. మొదట పాదయాత్రకు కొన్ని నిబంధనలు విధించింది. ఆ తరువాత పోలీసుల తీరుపై, నిబంధనలపై హైకోర్టులో పిటీషన్ వేశారు రైతులు. దానిపై విచారించిన హైకోర్టు రాజధాని నిర్ణయం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. దీనితో ప్రభుత్వం హైకోర్టు (High Court) తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు.  మరి మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు (Suprme Court) ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి మరి.

First published:

Tags: Ap, AP Three Capitals, Supreme Court, Ycp

ఉత్తమ కథలు