హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Visakha Garjana: విశాఖ గర్జనకు సర్వం సిద్ధం.. ఉత్తరాంధ్రలో హీటెక్కిన రాజకీయం

Visakha Garjana: విశాఖ గర్జనకు సర్వం సిద్ధం.. ఉత్తరాంధ్రలో హీటెక్కిన రాజకీయం

విశాఖ గర్జన సభకు ఏర్పాట్లు

విశాఖ గర్జన సభకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధానిపై రాజకీయాలు హీటెక్కాయి. మూడు రాజధానుల నినాదంతో అధికార వైసీపీ (YCP) ముందుకెళ్తోంది. అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ - మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Anand Mohan Pudipeddi, News18, Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజధానిపై రాజకీయాలు హీటెక్కాయి. మూడు రాజధానుల నినాదంతో అధికార వైసీపీ (YCP) ముందుకెళ్తోంది. అమరావతి (Amaravathi) రైతుల పాదయాత్రకు కౌంటర్ గా విశాఖలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మన విశాఖ - మన రాజధాని అనే నినాదంతో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధే లక్ష్యమంటూ జేఏసీ ఈ గర్జన సభను నిర్వహిస్తోంది. రాష్ర్ట అభివృద్ధిలో మూడు రాజధానుల పాత్ర ఎంతో కీలకమనేది వైసీపీ ప్రభుత్వం భావన.. ఇప్పుటికే సంక్షేమంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న ఏపీ ప్రభుత్వం.. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతోంది. రాష్ర్టంలోని ఒక ప్రాంతాన్ని కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని.. అది మూడు రాజధానుల ద్వారానే సాధ్యమవుతుందనేది వైసీపీ వాదన.

విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర జేఏసీ తలపెట్టిన విశాఖ గర్జన సభకు సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైసీపీ మఖ్యనేతలంతా విశాఖలోనే మకాం వేసి ఈ సభను విజయవంతం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఉత్తరాంధ్ర, విశాఖ ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికార పార్టీ స్పష్టం చేస్తోంది.

ఇది చదవండి: అమరావతి కోసం వైసీపీ మాస్టర్ ప్లాన్.. జగన్ థింకింగ్ అలా ఉందా..?

రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలంటూ పాదయాత్ర చేస్తున్న వారికి నిరసన తెలియజేసేందుకే విశాఖ గర్జన సభను నిర్వహిస్తున్నట్లు ఉత్తరాంధ్ర జేఏసీ చెబుతోంది. అమరావతి అభివృద్ధికి ఉత్తరాంధ్ర ప్రజలేమీ అడ్డు పడడం లేదని, అలాంటప్పుడు పాదయాత్ర చేస్తున్నవాళ్లు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎందుకు మోకాలడ్డుతున్నారని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇది చదవండి: గన్నవరంలో అక్రమ మైనింగ్.. అసలు నిజం ఇదే..! ఎమ్మెల్యే వంశీ సంచలన కామెంట్స్

విశాఖ రాజధానిగా ఏర్పడడానికి ఎవరు అడ్డు పెట్టొద్దని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం నుండి బయటపడటానికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉత్తరాంధ్ర జేఏసీ ఛైర్మన్ లజపతిరాయ్ అన్నారు. అదే సమయంలో ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 1956లో విశాఖపట్నాన్ని శాశ్వత రాజధానిగా చేయాలని నిర్ణయించినా, రాజకీయ పెద్దల మద్దతు లేకపోవడం వల్ల అది కలగానే మిగిలిపోయిందన్నారు. మరోసారి విశాఖ రాజధాని కావడానికి అవకాశం వచ్చిందని దీన్ని మిగిలిన ప్రాంతాల వారు కూడా సహకరించాలని లజపతిరాయ్ విజ్ఞప్తి చేశారు.

విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న విశాఖ గర్జన సభ ఎలా సాగుతుంది..? ఈ సభతో ఉత్తరాంద్ర వాయిస్ రాష్ట్రమంతా తెలుస్తుందా లేదా అని వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, AP Three Capitals, Visakhapatnam

ఉత్తమ కథలు