Mega Support: గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా జనసేన (Janasena)కు ఘోర భంగపాటు తప్పలేదు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు.. కాపు సామాజికవర్గం మద్దతు ఉంది. సభలు.. సమావేశాలకు భారీగా జనం హాజరయ్యారు. ఈ లెక్కన చూసుకుంటే పవన్ పార్టీకి గౌరవప్రథమైన సీట్లు రావాలి.. కానీ వైసీపీ అధినేత జగన్ (YCP Chief Jagan) గాలి ముందు.. గాజు గ్లాసు ముక్క ముక్కలైంది. అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయారు.. ఇది నిజంగా మెగా అభిమానులకు పెద్ద అవమానమే.. అయితే ఆ పార్టీ నుంచి బోణీ అయితే చేసింది. రాజోలు నుంచి జనసేన అభ్యర్థి విజయం సాధించారు. కాకపోతే అది మూనాళ్ల ముచ్చట్టే అయ్యింది. ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే రాపాక బోర్డు తిప్పేశారు.. సీఎం జగన్ కు జై కొట్టారు.. తరువాత పూర్తిగా వైసీపీ ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నారు. అయితే అదంతా గతం అంటున్నారు మెగా అభిమానులు.. ఈ సారి మెగా ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపిస్తామంటున్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేరుగా కాకపోయినా.. పొత్తులు పెట్టుకుంటే అధికారంలోకి రావడానికి ఓ మార్గం దొరికినట్టే అవుతుంది.. కానీ అది జరగాలంటే.. ముందు మెగా ఫాన్స్ అంతా ఒకే వేదికపై ఉండాలి..
ఈ విషయాన్ని జనసేనాని పవన్ ముందుగానే గుర్తించారు.. అందుకే వేగంగా పావులు కదిపారు.. పార్టీని బలోపేతం చేయడంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రానున్న ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాలను గెలుచుకొనేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిత్యం ప్రజల్లో ఉంటూ అధికార పార్టీ అరాచకాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు పడింది. జనసేన పార్టీకి అండగా నిలిచేందుకు, వచ్చేఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘాల సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Mega Support to Janasena || Megastar Chiranjeevi || Pawan Kalyan || Ram... https://t.co/aS5jvGvbca via @YouTube #mega #megafiles #megalinktrades #megalinksfree #PawanannaPrajaBata #Pawanakalyan #JanasenaParty #JanasenaForNewAgePolitics
— nagesh paina (@PainaNagesh) May 22, 2022
ఈ సమావేశానికి ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన మెగా అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి మద్దతుగా ఉండేలా తీసుకోవాల్సిన భవిష్యత్ కార్యాచణపై చర్చించారు.. మెగా అభిమానులంతా ఇకపై ఏకతాటిపైకి రావాలని.. వైసీని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపు ఇచ్చారు. గతంలో పీఆర్పీకి సహకారం అందించిన విధంగానే రానున్న రోజుల్లో జనసేనకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలని, పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి : ఆ జిల్లాలో అధికార పార్టీలో రివేంజ్ పాలిటిక్స్..! వైసీపీకి తలనొప్పిగా వేరు కుంపట్లు
అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ.. జనసేన పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. మెగా అభిమానులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వస్తున్నామని, నాగబాబు త్వరలో అభిమానులంద రితో ప్రత్యేకంగా భేటీ అవుతారని స్పష్టం చేశారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆదేశాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా మెగా అభిమానులను చురుకైన పాత్ర పోషించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Mega power star ram charan, Megastar Chiranjeevi, Pawan kalyan