హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

BC Politics: బీసీల చుట్టూ ఏపీ రాజకీయం.. కేబినెట్ లో 10 మందికి పదవులిచ్చామంటున్న వైసీపీ.. బీసీ సంఘాలతో టీడీపీ భేటీ

BC Politics: బీసీల చుట్టూ ఏపీ రాజకీయం.. కేబినెట్ లో 10 మందికి పదవులిచ్చామంటున్న వైసీపీ.. బీసీ సంఘాలతో టీడీపీ భేటీ

బీసీ ఓట్లే అన్ని పార్టీల టార్గెట్

బీసీ ఓట్లే అన్ని పార్టీల టార్గెట్

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్నీ బీసీల చుట్టే తిరుగుతున్నాయి. అన్నిపార్టీలు ప్రస్తుతం బీసీ జపం చేస్తున్నాయి. ఇంత సడెన్ గా అన్ని పార్టీలు బీసీలను ఎందుకు దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయో తెలుసా..?

BC Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైమ్ ఉంది. 2024 ఎలక్షన్స్ ఫైట్ కోసం ఇప్పటినుంచే పార్టీలు స్కెచ్ వేస్తున్నాయి. అందులో భాగంగా అన్ని ప్రధాన పార్టీలు జనం బాట పడుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) వంటి పార్టీలు రెండేళ్లలో ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేయగా.. అధికార పార్టీ గడప గడపకు వైసీపీ (YCP) అంటూ జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల టీంను కూడా రెడీ చేసుకున్నారు సీఎం. తీవ్ర కసరత్తు తరువాత.. బీసీలకు అధికపదవులు దక్కేలా కేబినెట్ కూర్పు చేశారు. కేబినెట్ కూర్పు మాత్రమే కాదు అన్ని అంశాల్లో సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా పథకాలను అమలు చేస్తున్నారు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ అదే ఫార్ములా ఫాలో అవ్వాలని చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. కేబినెట్ కూర్పులో అగ్రభావం ఇవ్వడం చూస్తే అర్థం చేసుకోవచ్చు వచ్చే ఎన్నికల నాటికి బీసీలే వైసీపీ ప్రధాన అజెండా అని. అందులో భాగంగానే..ఇటీవల ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణా రెడ్డి.. తొలి కేబినెట్ లోని బీసీ మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

అధికార వైసీపీ వ్యూహాలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ సైతం అలర్ట్ అయ్యింది.. పోయిన అధికారం తిరిగి రాబెట్టుకోవాలి అంటే బీసీల మద్దతు టీడీపీకి చాలా అవసరం. గతంలో టీడీపీ ఎక్కవ మద్దతు టీడీపీకే వచ్చింది. అయితే గత ఎన్నికల్లో బీసీలు రెండు వర్గాలుగా చీలో ఓ వర్గం ఓట్లు వైసీపీకి పడ్డాయి. ఇది కూడా వైసీపీ ఘన విజయానికి ఓ కారణం. అయితే మొదటి నుంచి తమతోనే ఉన్న బీసీలు.. గత ఎన్నికల్లో ఎందుకు చీలారు.. మళ్లీ బీసీలు మొత్తం టీడీపీవైపు రావాలంటే ఏం చేయాలి అన్నదానిపై ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేసినట్టు కనపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు చొర‌వ చూపారు.

ఇదీ చదవండి : తొలి కేబినెట్ లో ఆయనో డమ్మీ అన్నారు.. ఇప్పుడు ఆయన టీంకే ప్రయారిటీ.. ఈ మార్పు కారణం అదేనా..?

టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా బీసీల సదస్సు నిర్వహించారు. తాజా మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో అత్య‌ధికంగా బీసీల‌కు చోటు క‌ల్పించామంటూ వైసీపీ పబ్లిసిటీ చేస్తోందంటూ మండిపడ్డారు. అసలు బీసీ నాయ‌కుల‌ను త‌యారు చేసే క‌ర్మాగారం టీడీపీ అని అన్నారు. మూడేళ్ల‌లో బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు ఏం చేశారో సీఎం జ‌గ‌న్ శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని స‌వాల్ విసిరారు. బీసీలకు ఏ ప్రభుత్వం ఏం చేసింది అన్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్‌కు సవాల్ విసిరారు. బీసీల‌కు ఎన్నో ప‌థ‌కాలు తీసుకొచ్చింది టీడీపీ హ‌యాంలోనే అని గుర్తు చేశారు. బ‌ల‌హీన వ‌ర్గాల నిధుల‌ను దారి మ‌ళ్లించిన ఘ‌న‌త వైసీపీదే అన్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి బ‌ల‌హీన వ‌ర్గాలంటే కోప‌మ‌న్నారు.

ఇదీ చదవండి : s: నిమ్మకాయ కంటే యాపిల్ బెటరా..? కన్నీరు పెడుతున్న టమాటో రైతులు.. ఎందుకో తెలుసా..?

జాతీయ పార్టీ బీజేపీ కూడా ఈ మధ్య బీసీ జపం చేస్తోంది. కేవలం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని.. నిజంగా ఆ రెండు పార్టీలకు చిత్త శుద్ధి ఉంటే.. బీసీ నేతను సీఎంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలంతా బీజేపీవైపే ఉంటారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే వైసీపీ లెక్కలు వేరే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు మాట.. ప్రస్తుతం కాపు వర్గల్లో ఎక్కుమంది వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం ఉంది. దానికి తోడు పవన్ వెంట ఎక్కువమంది వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు కాపు ఓట్లు మైనస్ అయితే.. బీసీలతో ఆ నష్టాన్ని పూడ్చాలన్నది జగన్ భావన అయి ఉండోచ్చు అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Chandrababu Naidu

ఉత్తమ కథలు