Balayya: నందమూరి నట సింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ చిత్రం వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోగా ఫ్యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీని గోపిచంద్ మలినేని (Gopichand Malineni) తెరకెక్కించారు. శ్రుతి హాసన్ (Sruthi Hasan) హీరోయిన్గా ననటించారు. ఫ్యాక్షన్-చెల్లెలి సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రంలో బాలయ్య నటనకు మరోసారి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీశాయి. ఈ సక్సెస్ మీట్ లో బాలయ్య నోరు జారారని ఆయన తీరుపై పలువురు మండిపడుతున్నారు. సీనియర్ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) పై బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కినేని తొక్కినేని అంటూ.. బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనికి తాజాగా అక్కినేని హీరోలు గట్టిగా సమాధానం ఇచ్చారు.
బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు హర్ట్ అయ్యారు. అందుకే అక్కినేని నాగచైతన్య బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.”నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అలాగే ఎస్వీ రంగారావు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరచుకోవడం” అంటూ నాగచైతన్య ట్వీట్ చేశారు. అటు అఖిల్ అక్కినేని కూడా సేమ్ టు సేమ్ ఇదే ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం కాస్త సీరియస్ అవుతుందని తెలుస్తుంది.
అదే ఫంక్షన్ లో బాలయ్య బాబు గారు ఎంతో సంతోషంగా వాళ్ళు మరియు తెలుగు వారు అందరూ గొప్పగా భావించే వ్యక్తి గురించి పంచుకున్న విషయాన్ని కూడా చూడండి...సగం సగం ఎడిట్ చేసి లేనిపోనివి సృష్ఠించి,తెదేపా కి వాళ్ళను దూరం చేయాలనే ఈ విఫల యత్నాలు. గమనించిగలరు...???? pic.twitter.com/dZmxYhUGHS
— Swathi Reddy (@Swathireddytdp) January 24, 2023
కేవలం అక్కినేని హీరోలే కాదు.. నందమూరి బాలకృష్ణ, తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేసింది. స్వర్గీయ ఎస్వీ రంగారావును ఉద్దేశించి బాలయ్య ‘‘ఆ రంగారావు, ఈ రంగారావు’’ అంటూ చేసిన వ్యాఖ్యలను కాపు సామాజిక వర్గం కాపునాడు తీవ్రంగా పరిగణించింది. గతంలో కూడా రాజకీయాల్లో చిరంజీవి విఫలమయ్యారని, రాజకీయాల్లో విజయం తమకే సాధ్యమంటూ ‘‘మా బ్లడ్డు వేరు, మా బ్రీడు వేరు’’ అన్న మాటలు సైతం కాపుల మనోభావాల్ని దెబ్బతీశాయి అంటున్నారు.
జనసేన పార్టీలో తిరిగే వారందరూ.. అలగాజనం అని, సంకరజాతి జనం అని అన్న మాటలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయన్నారు. బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలపై 25వ తేదీ సాయంత్రంలోపు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే.. రాష్ట్రంలో ఉన్న వంగవీటి రంగారావు విగ్రహాల దగ్గర కాపు సోదరులందరూ ప్లాకార్డులు ప్రదర్శించి, మౌన నిరసన తెలపాలని కాపునాడు పిలుపునిచ్చాడు.
ఇదీ చదవండి : అందుకే అంత ఫాలోయింగ్.. పవన్ మూడు పెళ్లిళ్లపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
గతంలో దేవబ్రాహ్మణులకి సంతకం లేని లేఖ విడుదల చేసినట్టు కాకుండా.. స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి, సదరు వ్యాఖ్యలు చేసినందుకు గాను క్షమాపణ కోరాలని బాలయ్యని కాపునాడు డిమాండ్ చేసింది. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇవ్వాలని.. లేకపోతే తెలుగు రాష్ట్రాలలో వంగవీటి మోహనరంగా విగ్రహాల వద్ద నిరసన చేపడుతాడమని పేర్కొంది. అలాగే.. తెలుగుదేశం పార్టీ నుండి బాలయ్యని పది సంవత్సరాల పాటు బహష్కరించాలని కాపునాడు కోరింది. టీడీపీ ఆ పని చేయకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటుందని హెచ్చరించింది. మరి బాలయ్య దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Nandamuri balakrishna