AP POLITICS AGNIPATH PROTEST TENSION ALL OVER INDIA AFTER SECUNDERABAD ISSUE ANDHRA PRADESH ALERT NGS
Agnipath: సికింద్రాబాద్ ఘటనతో ఏపీ అప్రమత్తం.. వాల్తేరు రైల్వే డివిజన్ సహా ప్రధాన స్టేషన్లలో భద్రత కట్టుదిట్టం
వాల్తేర్ డివిజన్ లో భద్రత కట్టుదిట్టం
Agnipath: కేంద్ర తాజాగా చేసిన ప్రకటన తీవ్ర నిరసనలకు కారణం అవుతోంది. మొదట ఉత్తర భారత దేశానికి పరిమితమైన ఆందోళనలు.. ఇప్పుడు తెలంగాణ అట్టుడికేలా చేశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్ని గుండంలా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ అలర్ట్ అయ్యింది. ప్రముఖ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Agnipath: దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం (Central Government) తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆర్మీ రిక్రూట్ మెంట్ (Army Recurtment) లో భాగంగా కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ (Agnipath) పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసలు.. తారా స్థాయికి చేరాయి. నిన్నటి వరకు ఉత్తరభారతానికి మాత్రమే పరిమితమైన.. ఈ ఆందోళనలు తెలంగాణ (Telangnana)కు కూడా పాకాయి. నిరసనలు కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station)లో పెను విధ్వంసం సృష్టించారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రబ్బరు బుల్లెట్లను ఉపయోగించారు. ప్రతిగా నిరసన కారులు రాళ్లు రువ్వురు.. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఓ వైపు పోలీసులు రబ్బరు బుల్లెట్లు ప్రయోగిస్తే.. అటు నుంచి నిరసన కారులు రాళ్లు రువ్వారు.. దీంతో అక్కడి వాతావరణం రక్తసిక్తంగా మారింది. పలువరుకి తీవ్ర గాయాలు అయ్యాయ. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు. అయితే ఈ ఆందోళనలు ఇక్కడికే పరిమితం అయ్యేలా కనిపించడం లేదు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్ను మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ ఘటనలో నాంపల్లి రైల్వే స్టేషన్ ను మూసివేశారు. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లను..మెట్రో రైళ్లను కూడా నిలిపివేశారు. తాజా పరిణమాల నేపథ్యంలో.. ఆంధ్ర ప్రదేశ్ లో రైల్వే అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ముందుగానే వాల్తేరు రైల్వే డివిజన్ పై నిఘా పెంచారు. వాల్తేరు రైల్వే డివిజన్ లోని విశాఖ సహా పలు రైల్వే స్టేషన్ లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాల్తేరు డివిజన్ లోని పరిస్థితిపై డీఆర్ఎం అనూప్ కుమార్ సమీక్షించారు.
తెలంగాణలో హింసాత్మకంగా మారిన ఆందోళనలు ఏపీకి కూడా పాకితే ప్రమాదమే.. ఈ నేపథ్యంలోనే ముందుగా రైల్వే పోలీసులు.. ఇతర అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం అందించినట్టు గుర్తించారు.
ఇదీ చదవండి : వైసీపీ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు.. 23 నుంచి వైసీపీ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ.. అందరి చూపు ఆమెపైనే?
కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తమ సమస్యలు తీసుకురావాలని తాము నిరసనలు చేపట్టామంటున్నాు అభ్యర్థులు. అయితే శాంతియుతంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనలు చేద్దామనుకుంటే.. పోలీసులు ఓవర్ యాక్షన్ కారణంగానే.. కొందరు ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులపై తిరగబడాల్సి వచ్చింది అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం.. ఆందోళనలు అదుపుచేసేందుకు ఫైరింగ్ చేశామంటున్నారు. ఆందోళన పరిస్థితిపై రైల్వే డీజీ సందీప్ శాండిల్య ఆరా తీశారు. ఆందోళనను కట్టడి చేయడంతో పాటు రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.