Home /News /andhra-pradesh /

AP POLITICS AFTER PRASHANTH KISHORE NEW STRATEGIST TO TAKE CHARGE FOR YSRCP FULL DETAILS HERE PRN GNT

YCP New Strategist: వైసీపీకి కొత్త వ్యూహకర్త.. పీకే ప్లేస్ లో వచ్చేది ఆయనే..!

వైసీపీకి కొత్త వ్యూహకర్త..?

వైసీపీకి కొత్త వ్యూహకర్త..?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి జగన్ పాదయాత్ర ముఖ్యకారణమైతే.. మరోకారణం ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) వ్యూహాలు.

  Anna Raghu, News18, Amaravati

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి జగన్ పాదయాత్ర ముఖ్యకారణమైతే.. మరోకారణం ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) వ్యూహాలు. ఐతే ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని వైసీపీ పెద్దలు స్పష్టం చేసిన నేపథ్యంలో కొత్త వ్యూహకర్త ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్)ని వరుసగా రెండోసారి కూడా వైసీపీ నియమించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇక్కడ వ్యూహకర్త మాత్రం మారనున్నారు. ఐప్యాక్ లో పనిచేస్తున్న రిషితో వైసీపీ చేతులు కలపనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ఐప్యాక్ వ్యవస్థాపకుడు అయిన ప్రశాంత్ కిషోర్ కు సహోద్యోగి ఐ-ప్యాక్ టీమ్ లీడర్ రిషి రాజ్ సింగ్ పార్టీ నేతలకు జగన్ పరిచయం చేస్తారని సింగ్ సూచించిన వ్యూహాల ప్రకారం ఎలా పని చేయాలో వారికి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో వరుసగా పార్టీ విజయం కోసం కృషి చేసేందుకు వైఎస్సార్సీపీతో ఐ-పీఏసీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. మే రెండో వారం నుంచి పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

  ఇది చదవండి: అక్కడే నిలిచిపోయిన రుతుపవనాలు.. తొలకరి మరింత ఆలస్యం..


  ఐప్యాక్ సభ్యుల బృందం తదుపరి ఎన్నికలలో పార్టీ అవకాశాలు పార్టీ అభ్యర్థుల సానుకూల ప్రతికూల అంశాలపై అట్టడుగు స్థాయి నుండి ఇన్పుట్లను సేకరించే పనిని కూడా ప్రారంభించింది. సంక్షేమ పథకాల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించేందుకు బృంద సభ్యులు కార్యాచరణలోకి దిగారు. ఆటుపోట్లను పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మార్చడానికి ఖచ్చితంగా ఏమి చేయవచ్చు అనే విషయాలపై ఐప్యాక్ సభ్యులు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.

  ఇది చదవండి: అమ్మఒడి జాబితాలో మీ పేరు లేదా.. అయితే ఇలా చేయండి..


  ఐప్యాక్ టీమ్ సభ్యుల మరో బృందం కూడా మీడియా నిర్వహణ సమస్యలపై పని చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ మీడియా విభాగాలు సక్రమంగా ప్రసారం చేయగలుగుతున్నాయా అనే అంశంతో పాటు పార్టీకి మీడియాకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైనా ఉందా అనే దానిపై ఆరాతీస్తున్నాయి. ప్రస్తుతం ఈ టీమ్ న్యూట్రల్ గా ఉండే మీడియా సంస్థలపై దృష్టిపెట్టింది. అలాగే టీడీపీ అనుకూల మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వ్యక్తులను కూడా తమవైపు తిప్పుకునేందుకు ఐ-ప్యాక్ వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్.

  ఇది చదవండి: వైసీపీ ప్లీనరీకి ముహూర్తం ఫిక్స్.. 2024 ఎన్నికలే టార్గెట్.. జగన్ వ్యూహం ఇదేనా..!


  ఎవరీ రిషి..?
  యూపీలోని కాన్పూర్ కు చెందిన రిషీ.. ఐఐటీ స్టూడెంట్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా కొన్నేళ్లు పనిచేసిన తర్వాత 2013లో ప్రశాంత్ కిశోర్ తో కలిసి సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (CAG) అనే సంస్థను స్థాపించాడు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచారానికి కాగ్ పని చేసింది. త్రీడీ షోల నుంచి ‘చాయ్ పే చర్చా’ వరకు మోడీకి సంబంధించిన అన్ని ప్రచారాలను ఆ సంస్థ నిర్వహించింది. అది పెద్ద హిట్ అవడమే కాకుండా.. మోడీని ప్రధాని కుర్చిలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత కాగ్ ను రద్దు చేసి.. బీహార్ లో నితీష్ కుమార్ కోసం పనిచేసేందుకు ఐ ప్యాక్ ను ప్రారంభించారు. అక్కడ సక్సెస్ అయిన తర్వాత.. 2019లో ఏపీలో వైసీపీ కోసం పనిచేసింది ఐప్యాక్. ఇప్పుడు 2024లో ఐ ప్యాక్ సంస్థే వైసీపీ కోసం పనిచేయబోతున్నా.. వ్యూహకర్తగా మాత్రం రిషి రంగంలోకి దిగనున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు