Home /News /andhra-pradesh /

AP POLITICS AFTER NARAYANA ITS CHANDRBABU TURN CID MAY ARREST TDP CHIEF IN AMARAVATI CASE FULL DETAILS HERE PRN

AP Politics: నారాయణ తర్వాత చంద్రబాబేనా..? జగన్ సర్కార్ నెక్స్ట్ ఇదేనా..?

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

సీఎం జగన్,చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు పొత్తులపై తీవ్ర చర్చలు జరగ్గా.. ఇప్పుడు అనూహ్యంగా అరెస్టుల వైపు మళ్లాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణతో సహా మొత్తం 14 మందిపై సీఐడీ కేసు నమోదవడం, అదే రోజు పేపర్ లీకేజ్ కేసులో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు పొత్తులపై తీవ్ర చర్చలు జరగ్గా.. ఇప్పుడు అనూహ్యంగా అరెస్టుల వైపు మళ్లాయి. టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణతో సహా మొత్తం 14 మందిపై సీఐడీ కేసు నమోదవడం, అదే రోజు పేపర్ లీకేజ్ కేసులో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారాయి. గత నెల 27న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 6న ప్రాధమిక విచారణ పూర్తి చేసిన సీఐడి.. ఆ మేరకు ఎఫ్ఐఆర్ ను సిద్ధం చేసింది. అమరావతి ల్యాండ్ పూలింగ్, రాజధాని డిజైన్, ఇన్నర్ రింగ్ రోడ్ పరిధి వంటి అంశాల్లో ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ వ్యవహారంలో చంద్రబాబును ఏ-2గా, నారాయణను ఏ-2గా సీఐడీ పేర్కొంది. ఏ-3గా లింగమనేని రమేష్, ఏ-4గా లింగమనేని రాజశేఖర్, ఏ-5గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంజనీ కుమార్, ఏ-6గా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఏ-7గా ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, ఏ-8గా ఎల్ఈపీఎల్ ఇన్ఫోసిటీ, ఏ-9గా ఎల్ఈపీఎల్ స్మార్ట్ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, ఏ-10గా లింగమనేని అగ్రికల్చర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ-11గా లింగమనేని ఆగ్రో డెవలపర్స్, ఏ-12గా జయని ఎస్టేస్ట్స్, ఏ-13గా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ- ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులను పేర్కొంది.

    చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు

    ఇది చదవండి: అమరావతి, విశాఖపై జగన్ దృష్టి.. కీలక ప్రాజెక్టులపై అధికారులకు సీఎం ఆదేశాలు


    ఐతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రులు, అప్పటి కీలక నేతలపై దృష్టిపెడుతూ వచ్చింది. అందులో భాగంగానే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కూడా అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల నరేంద్రను, అంతకుముందు వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారు.

    ఇది చదవండి: పొత్తుల‌పై క‌న్ఫ్యూజ‌న్ లో ప‌వ‌న్..? త్వర‌లో కీల‌క ప్ర‌క‌టన..? న్యూస్18 ఎక్స్ క్లూజివ్..!


    ఐతే వీరంతా ఆయా కేసుల్లో నిందితులకు పేర్కొంటూ అరెస్టులు చూపించారు. తాజాగా కేసులో చంద్రబాబును ఏ-1గా పేర్కొనడంతో ఆయన విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ వేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్కే ఫిర్యాదుపై త్వరలోనే చంద్రబాబును అరెస్ట్ చేస్తారా..? ఈ కేసు విషయంలో జగన్ సర్కార్ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉండబోతోంది..? ఈ వ్యవహారం రాజకీయంగా టీడీపీకి ప్లస్ అవుతుందా.. లేక వైసీపీకి ప్లస్ అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu

    తదుపరి వార్తలు