హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను వివాదాలు వీడడం లేదు. ఎదో వివాదం ద్వారా ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అనంతపురం పట్టణంలోని రామ్‌నగర్‌లో ఇంటి అద్దె, కరెంట్ బిల్లులు చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల నగ్న వీడియో కాల్ వివాదంలో చిక్కుకున్న సంగతి రచ్చ రచ్చగా మారింది. ఓ మహిళతో మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా బుక్కయ్యారని ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై బురద జల్లేందుకే ఆ వీడియోను మార్ఫ్ చేశారని మాధవ్ ఆరోపించారు. కానీ, ఆ వీడియోలో ఉన్నది మాధవేనని, ఫోరెన్సిక్ నిపుణులు కూడా అదే విషయం చెప్పారని టిడిపి నేతలు విమర్శలు చేశారు. ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఆ వివాదంపై నిత్యం విమర్శలు తప్పడం లేదు.
ఆ వివాదం మరువకముందే.. తాజాగా మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. మాధవ్ ఉంటున్న ఇంటికి అద్దె, కరెంటు బిల్లులు చెల్లించడం లేదని ఆ ఇంటి యజమాని మల్లికార్జున రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు అద్దె బకాయిలు చెల్లించాలని కోరిన తనను టిప్పర్లు పెట్టి తొక్కించేస్తామంటూ మాధవ్ అనుచరులు బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే మాధవ్ వివాదం తెరపైకి వచ్చి తరువాత.. నేరుగా ఆయన సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు. తాజాగా ఆయన సీఎం జగన్ ను కలిసి.. సత్కరించారు. అయితే అధినేత జగన్ ను కలవడం వెనుక వేరే కారణం కూడా ఉంది. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆధ్వర్యంలో మదాసి కురువ, మదారి కురువ సంఘాల ప్రతినిధులు కలిశారు.
ఇదీ చదవండి : దాంతో సంబంధం లేదని చంద్రబాబు ప్రమాణం చేస్తారా..? పవన్ పైనా కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
ఇప్పటివరకు మదాసి కురువ, మదారి కురువ కులాలకు ఇచ్చే కుల ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో పరిధి నుంచి తహశీల్దార్ పరిధిలోకి మారుస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతుందా? రేపు ప్రధాని మోదీతో పవన్ భేటీ
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు ఎంతో ప్రయోజనకరమని సంతోషం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘం ప్రతినిధులు కురువ సాంప్రదాయం ప్రకారం కంబలి కప్పి ముఖ్యమంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే ఆయన సీఎంను కలిశారు. తమ కులస్ధులు ఎదుర్కుంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడంతో ఆయన సానుకూలంగా స్పందించారని మాధవ్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics