హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: కోటంరెడ్డి ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన సీఎం జగన్..ఇంఛార్జ్ బాధ్యతలతో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఆయనకే!

Ap: కోటంరెడ్డి ప్రత్యర్థిని ఫిక్స్ చేసిన సీఎం జగన్..ఇంఛార్జ్ బాధ్యతలతో పాటు ఎమ్మెల్యే సీటు కూడా ఆయనకే!

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఇంఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. కోటంరెడ్డి స్థానంలో నియోజకవర్గ బాధ్యతలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. అంతేకాదు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. కాగా కొన్నిరోజులుగా ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని కోటంరెడ్డి  విమర్శలు చేయగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. కోటంరెడ్డి స్థానంలో నియోజకవర్గ బాధ్యతలను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు. అంతేకాదు నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు. కాగా కొన్నిరోజులుగా ప్రభుత్వం నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని కోటంరెడ్డి  విమర్శలు చేయగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

BIG BREAKING: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం..ఈడీ ఛార్జ్ షీట్ లో ఢిల్లీ సీఎం, వైసీపీ ఎంపీ పేర్లు

కోటంరెడ్డికి చెక్..ఇంఛార్జ్ బాధ్యతలు ఆదాల చేతికి..

తన ఫోన్ ట్యాప్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బహిరంగంగానే వైసీపీపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై హైకమాండ్ సీరియస్ అయింది. ఇక తాజాగా ఆయనకు  సంబంధించి ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియోలో 'నేను వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచే పోటీ చేస్తానని చెప్పి తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఆధారాలు బయటపెట్టారు. ఈ క్రమంలో కోమటిరెడ్డికి అధిష్టానం చెక్ పెట్టె విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

YS Jagan-Nellore: నెల్లూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్‌లు.. కోటంరెడ్డి తరువాత మరో ఎమ్మెల్యే అసంతృప్తి గళం

కోటంరెడ్డి కంటే ముందు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) కూడా ఇదే రకంగా వైసీపీ నాయకత్వం, ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో వైసీపీ నాయకత్వం ఆయనను పక్కనపెట్టింది. ఈ మేరకు ఇంఛార్జి బాధ్యతలను మరొకరికి అప్పగించింది. ఇలా ఒక్క నెల్లూరు(Nellore)  జిల్లాలోనే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి దాదాపుగా రెడీ అయిపోయినట్టు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇలా ఎన్నికలకు ముందు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న నాయకుల్లో ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు ఉన్నారనే దానిపై వైసీపీ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఆదాలకే పగ్గాలు ఎందుకు?

ఇక అదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్నాడు. దీనితో కోటంరెడ్డిని ఎదుర్కొనే వ్యక్తి ఆదాల అని అధిష్టానం భావించింది. అయితే ఈ రేసులో అనిల్, ఆనం, విజయ్ కుమార్ ఉండగా..ఆదాల వైపు సీఎం జగన్ మొగ్గు చూపారు. ఆయనకు బాధ్యతలు మాత్రమే అప్పగించకుండా కోటంరెడ్డిపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా ఫిక్స్ చేశారు.

First published:

Tags: Ap, AP News, Kotamreddy sridhar reddy, Ycp

ఉత్తమ కథలు