హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Balakrishna PA: వైసీపీ నేతలతో పేకాట.. బాలకృష్ణ పీఏ అరెస్ట్..

Balakrishna PA: వైసీపీ నేతలతో పేకాట.. బాలకృష్ణ పీఏ అరెస్ట్..

బాలకృష్ణ (ఫైల్)

బాలకృష్ణ (ఫైల్)

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ అరెస్టయ్యారు. అదేదో సెటిల్మెంటో లేక గొడవలోనే ఆయన అరెస్ట్ కాలేదు. పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అదికూడా వైసీపీ నేతలతో కాయ్ రాజా కాయ్ అంటూ సిట్టింగ్ వేశారు.

  సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ అరెస్టయ్యారు. అదేదో సెటిల్మెంటో లేక గొడవలోనే ఆయన అరెస్ట్ కాలేదు. పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కారు. అదికూడా వైసీపీ నేతలతో కాయ్ రాజా కాయ్ అంటూ సిట్టింగ్ వేశారు. ఆంధ్రా-కర్ణాటక సరిహద్దుల్లోని నగరిగేర వద్ద కొందరు పేకాట ఆడుతున్నట్లు కర్ణాటక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది అరెస్ట్ చేశారు. ఇందులో హిందూపురంకు చెందిన పేకాటరాయుళ్లు దొరికారు. పట్టుబడ్డవారిలో వైసీపీ, టీడీపీలకు చెందినవారున్నారు. వారిలో బాలకృష్ణ పీఏగా పనిచేస్తున్న బాలాజీతో పాటు హిందూపురం వైసీపీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి ఉన్నారు. నిందితులను కర్ణాటకలోని చిక్ బళ్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో హాజరుపరిచారు.

  ఇదిలా ఉంటే వైసీపీ నేతలతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ పేకాట ఆడటం చర్చనీయాంశమవుతోంది. నియోజకవర్గంలో వ్యక్తిగత పనుల కోసం పెట్టుకున్న వ్యక్తి ఇలా ప్రత్యర్థులతో సిట్టింగ్ వేయడంపై హిందూపురంలో ప్రతిఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ,టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఈ వైరం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే పీఏ వైసీపీతో కలిసిపోయి పేకాట ఆడటంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు.

  ఇది చదవండి: ఉక్రెయిన్ విద్యార్థులపై జగన్ కీలక నిర్ణయం.. ఆ విషయంలో సాయం చేస్తామన్న సీఎం

  ఇదిలా ఉంటే పీఏ వ్యవహారంలో బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు ఐదేళ్లకు పైగా బాలకృష్ణకు పీఏగా బాలాజీ వ్యవహరిస్తున్నాడు. ఆయన హిందూపురం వచ్చినప్పుడు అన్ని వ్యవహారాలను ఆయనే చూసుకుంటున్నారు. బాలకృష్ణ లేని సమయంలో అక్కడి రాజకీయ వ్యవహారాలను కూడా బాలాజీ చక్కబెడుతున్నారు. బాలయ్యకు అత్యంత కీలకమైన వ్యక్తి అధికార పార్టీ నేతలతో పేకాట ఆడటం, ఆపై పోలీసులకు చిక్కడంపై విమర్శలు వస్తున్నాయి. మరి బాలయ్య తన పీఏని కంటిన్యూ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

  ఇది చదవండి: ఒకేసారి రెండు వ్యూహాలు.. ఆయన రాజకీయం అలాగే ఉంటుంది మరి..!

  గతంలో బాలకృష్ణ దగ్గర పనిచేసిన పీఏగా పనిచేసిన శేఖర్ వ్యవహారం కూడా బాగా చర్చనీయాంశమైంది. బాలకృష్ణ లేని సమయంలో టీడీపీ నేతలపై పెత్తనం చేయడమే కాకుండా పార్టీని గ్రూపులుగా విడగొట్టారని.. బాలయ్యపేరుతో అవినీతి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లే తిరుగుబావుటా ఎగురవేశారు. ఐదేళ్ల క్రితం ఈ వ్యవహారం బాగా చర్చనీయాంశమైంది. పీఏ తీరుతో బాలకృష్ణ కూడా విమర్శలెదుర్కొన్నారు. చివరకు చంద్రబాబు జోక్యంతో టీడీపీ కార్యకర్తలు చల్లబడ్డారు. ఆ వివాదం కారణంగా శేఖర్ ను తప్పించిన బాలకృష్ణ.. ఆయన స్థానంలో బాలాజీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పీఏ వ్యవహారం కూడా రచ్చకెక్కడంతో బాలయ్య నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Bala Krishna Nandamuri

  ఉత్తమ కథలు