ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కులాలు కీలక పాత్రపోషిస్తుంటాయి. ఏపీలోనే కాదు ఎక్కడ చూసినా కులం లేనిదే రాజకీయం లేదు. కులాల వారీగా సంక్షేమ పథకాలు, కార్పొరేషన్లు ఏపీలో ఉన్నాయి. తాజాగా వైసీపీ (YSRCP) ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy) పై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన ట్వీట్లు వైరల్ గా మారుతున్నాయి. తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా విజయసాయి చేసిన కామెంట్స్ కు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. సాయిరెడ్డిపై తీవ్రపదజాలంతో ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడిన బండ్ల గణేష్.. ఒక వ్యక్తితో ఉన్న వైరాన్ని కులానికి ఆపాదిస్తే చెప్పుదెబ్బలు ఖాయమని హెచ్చరించారు కూడా. సాయిరెడ్డి గతంతో పాటు ప్రస్తుతాన్ని కూడా ప్రస్తావిస్తూ ట్వీట్ల బుల్లెట్లు పేల్చారు.
విజయసాయిని విషసాయి అని సంభోదిస్తూ మొదలైట్టిన బండ్ల గణేష్.. వేరే కులాన్ని ఎలా తిడతారని ప్రశ్నించారు. వైజాగ్ ని కుదిపేసిన తూఫాన్ నయం నీ కన్నా. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేసావ్ విష సాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి ... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండని హితవు పలికారు బండ్ల గణేష్.. అధికారం శాశ్వతం కాదన్న ఆయన.., రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావని.., ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదన్న బండ్ల.. తాను కమ్మవాణ్ణే కానీ టీడీపీ కాదంటూ విజయసాయిని ట్యాగ్ చేశారు.
మీకు కులం నచ్చకుంటే ...కమ్మ వాళ్ళు నచ్చకుంటే నేరుగా తిట్టoడి ... చంద్రబాబును టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మ వారిని తిట్టకండి
అధికారం శాశ్వతం కాదు
రేపు నువ్వు తప్పకుండా మాజీ అవుతావు
ప్రతి కమ్మ వారు తెలుగుదేశం కాదు
నేను కమ్మ వాణ్ణే కానీ టిడిపి కాదు@VSReddy_MP గారు
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
....కమ్మ వారిని తిట్టాడా న్ని తట్టుకోలేక పోతున్న
నీకు నచ్చని వారిని పేరు పెట్టి తిట్టు ...
దయచేసి కులాన్ని తిట్టకు...
ఇదేనా నీ సంస్కారం ?
నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు...ఎంపీ గా ఉన్నావని, అధికారంలో ఉన్నానని కళ్ళు నెట్టికెక్కి ప్రవర్తిస్తున్నవు @VSReddy_MP
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
అంతేకాదు కులపిచ్చకి నీ డబ్బు పిచ్చకి కమ్మ కులాన్ని బలిచేయ్యాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుందని హెచ్చరించారు. తనకు వైఎస్సార్ అన్నా జగన్ అన్నా గౌరవం కానీ నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రమంటూ సాయిరెడ్డిపై ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకోవాలిగానీ కులం ఏంచేసిందని ప్రశ్నించారు. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బ రుచిచూపిస్తారని ఘాటుగా హెచ్చరించారు. త్వరలో జగన్ కు వెన్నుపోటు పొడవడం ఖాయమన్న బండ్ల.. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసని.., అన్నింటికీ సిద్ధపడే చేస్తున్నాని క్లారిటీ ఇచ్చారు.
నీకు నచ్చకుంటే వ్యక్తి పేరు పెట్టి తిట్టు
కానీ కులాన్ని కాదు...నిన్ను జైల్ కు పంపింది... కమ్మ వారు కాదు...
త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి...
ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో తెలుసు
అన్నిటికీ సిద్ధపడే చేస్తున్నా
.@VSReddy_MP
— BANDLA GANESH. (@ganeshbandla) April 15, 2022
ఇదిలా ఉంటే శుక్రవారం తిరుపతిలో వైసీపీ జాబ్ మేళా సందర్భంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి.. చంద్రబాబు తన హాయంలో వారి కులానికే ఉద్యోగాలు ఇప్పించుకున్నారని.. కులరాజకీయాలు చేశారని ఆరోపించారు. టీడీపీ ఒక కుల పార్టీగా తయారు అయ్యిందన్న విజయసాయి రెడ్డి అందుకే చంద్రబాబును ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.