Home /News /andhra-pradesh /

AP POLITICS ACTOR MANCHU MOHAN BABU MEETS TDP CHIEF NARA CHANDRABABU NAIDU IN HYDERABAD FULL DETAILS HERE PRN

MohanBabu Meets Chandrababu: చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ.. రాజకీయాలపైనే చర్చ.. టీడీపీలో చేరుతున్నారా..?

మోహన్ బాబు, చంద్రబాబు (ఫైల్)

మోహన్ బాబు, చంద్రబాబు (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) తో సినీ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan babu) భేటీ అయ్యారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Nara Chandrababu Naidu) తో సినీ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan babu) భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్ (Hyderabad) లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన మోహన్ బాబు.. గంటకు పైగా ఆయనతో సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన భేటీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు పేరు చెబితేనే మండిపడే మోహన్ బాబు.. స్వయంగా ఆయన ఇంటికి వెళ్లడం ఆసక్తిని రేకేత్తిస్తోంది. గతంలో టీడీపీలో ఉన్న మోహన్ బాబు ఆ పార్టీ ద్వారానే తన పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ (NTR) తో సన్నిహితంగా సన్నిహితంగా మెలిగారు. ఆ పార్టీ తరపున రాజ్యసభకు కూడా ఎంపికయ్యారు.

    ఏపీ పదవీకాలం ముగిసిన తర్వాత మోహన్ బాబు టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారాయన. ఎన్నికల తర్వాత ఎలాంటి పదవి దక్కకపోయినా పార్టీలోనే కొనసాగారు. ఏపీ సీఎం జగన్ తో ఉన్న బంధుత్వం కూడా వైసీపీలో చేరడానికి కారణమన్న ప్రచారం జరిగింది.

    ఇది చదవండి: హోమంత్రికి ఊహించని షాక్.. కొవ్వూరులో టీడీపీ ఏకగ్రీవం..


    ఇదిలా ఉంటే మోహన్ బాబు కొంతకాలంగా వైసీపీ (YSRCP) కి దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పిన మోహన్ బాబు.. వైసీపీని కూడా వీడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఇటీవల తిరుపతి (TIrupati) లో ఓ కేసు విచారణకు హాజరైన సందర్భంగా తాను బీజేపీ (BJP) వ్యక్తినని ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయన స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కావడం.. రాజకీయాలపై చర్చించారన్న ప్రచారం జరుగుతుండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    ఇది చదవండి: ఆ వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు ఈసారి నో టికెట్..? ఆమె కూడా ఫిక్సైపోయారా..?


    దశాబ్దాలుగా చంద్రబాబుకు, టీడీపీకి దూరంగా ఉంటున్న మోహన్ బాబు.. ఇప్పుడు సడన్ గా ఆయన ఇంటికి వెళ్లడం వెనుక రాజకీయ కారణాలున్నాయా... లేక వ్యక్తిగతంగానే కలిశారా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మీటింగ్ పై మోహన్ బాబు కుటుంబంగానీ, టీడీపీ వర్గాలు గానీ స్పందించలేదు. ఆయన మళ్లీ టీడీపీలో చేరుతున్నారా.. రాజకీయాలపై మరేదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Chandrababu Naidu, Manchu mohan babu, TDP

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు