Home /News /andhra-pradesh /

AP POLITICS ACTOR DIVYA VANI RESIGNED TO TELUGU DESHAM PARTY AFTER MAHANADU FULL DETAILS HERE PRN

Divya Vani: టీడీపీకి ఊహించని షాక్.. మహానాడు తర్వాత కీలక నేత రాజీనామా..

దివ్యవాణి (ఫైల్)

దివ్యవాణి (ఫైల్)

మహానాడు (Mahanadu) సక్సెస్ అయిన జోష్ లో ఉన్న టీడీపీ (TDP)కి షాక్ తగిలింది. సినీ నటి, ఆ పార్టీ అధికార ప్రతినిథి దివ్యవాణి (Divya Vani) టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.

    మహానాడు (Mahanadu) సక్సెస్ అయిన జోష్ లో ఉన్న టీడీపీ (TDP)కి షాక్ తగిలింది. సినీ నటి, ఆ పార్టీ అధికార ప్రతినిథి దివ్యవాణి (Divya Vani) టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. టీడీపీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ట్వీట్ చేశారు. కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్న దివ్యవాణి.. పార్టీ తరపున తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. మహానాడుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన మినీ మహానాడు కార్యక్రమాల్లో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆతే మహానాడులో జరిగిన కొన్ని ఘటనలతో మనస్తాపం చెంది ఆమె పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    ఇటీవల ప్రకాశం జిల్లాలో జరిగిన మహానాడులో దివ్యవాణికి వేదికపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కకుండా కొంతమంది అడ్డుపడుతున్నారని భావించే దివ్యవాణి పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. ఐతే పార్టీలో ఆమెను ఎదగకుండా చేస్తున్నదెవరనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.



    ఇదిలా ఉంటే పార్టీలోకి వచ్చిన అనతికాలంలోనే దివ్యవాణి రాష్ట్రఅధికార ప్రతినిథి అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారు. పార్టీలోని మహిళా నేతల్లో ఆమెకు మంచిపేరే ఉంది. ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఘాటుగానే విమర్శిస్తూ పార్టీలో మంచి పేరే తెచ్చుకున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున బరిలో దిగుతారన్న ప్రచారం కూడా జరిగింది.

    ఇది చదవండి: ఆత్మకూరు ఏకగ్రీవం కావడం వైసీపీకి ఇష్టం లేదా..? అధికార పార్టీ వ్యూహం ఇదేనా..?


    ఐతే మహానాడులో మైక్ ఇవ్వలేదన్న మనస్తాపంతో రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయంశమవుతోంది. రాజీనామాకు కేవలం మహానాడులో ఎదురైన పరిణామాలే కారణమా లేక మరేదైనా ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో దివ్యవాణిని అడ్డుకుంటున్నదెవరు.. ఈ విషయాలను అధినేత చంద్రబాబు దృష్టికిగానీ, లోకేష్ దృష్టికిగానీ తీసుకెళ్లలేకపోయారా..? లేక పార్టీ తీరుతో అసంతృప్తిగా ఉన్నారా..? లేదా మరో పార్టీలో చేరబోతున్నారా అనేదానిపై రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

    ఇది చదవండి: బార్లపై బాదుడే..! కొత్త బార్ పాలసీపై సీఎం జగన్ కసరత్తు..?


    ఐతే ఆమె పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు గానీ ఎలాంటి లేఖను విడుదల చేయలేదు. త్వరలోనే రాజీనామాకు సంబంధించిన వివరాలు చెబుతానని దివ్యవాణి చెప్పారు. మరి రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపుతారా.. లేక ఆయన పిలిస్తే వెళ్లి మాట్లాడాతారా.. అనేది వేచి చూడాలి.

    ఇది చదవండి: పాదయాత్రకు సిద్ధమవుతున్న లోకేష్.? త్వరలోనే రంగంలోకి.. బాబు స్కెచ్ ఇదేనా..?


    ఇదిలా ఉంటే మహానాడు ముగిసిన వెంటనే పార్టీ నేత రాజనామా చేయడం టీడీపీలో కలకలం రేపింది. మహానాడులో మైక్ ఇవ్వనంత మాత్రానా రాజీనామా చేస్తారా.. అని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలా అనుకుంటే సమయం లేక సీనియర్ నేతలతో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. అంతమాత్రానికే నొచ్చకుంటారా అని నిలదీస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, TDP

    తదుపరి వార్తలు