హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Posani Comments: సీఎంను ఇప్పటివరకు ఎవరూ ఇలా పోల్చలేదు.. జగన్ పై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Posani Comments: సీఎంను ఇప్పటివరకు ఎవరూ ఇలా పోల్చలేదు.. జగన్ పై నటుడి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) గురించి వైసీపీ (YSRCP) నేతలు, ఆయన అభిమానులు రకరకాలుగా పొగుడుతుంటారు. ఇక ఎమ్మెల్యేల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అసెంబ్లీలో బయట ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) గురించి వైసీపీ (YSRCP) నేతలు, ఆయన అభిమానులు రకరకాలుగా పొగుడుతుంటారు. ఇక ఎమ్మెల్యేల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అసెంబ్లీలో బయట ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటారు. మంత్రులు కూడా వీరికేం తక్కువ కాదు. గతంలో మంత్రులు చెల్లుబోయిన గోపాలకృష్ణ, నారాయణ స్వామి లాంటి వారు సీఎంను దైవాంశ సంభూతుడిగా పోల్చారు. తాజాగా ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).. సీఎం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ గురించి చెప్పారు. సీఎంను దూరంగా చూస్తే బ్రహ్మపదార్థం మాదిరిగా ఉంటారని.. కానీ దగ్గరగా చూస్తే దేవుని ప్రసాదంలో ఉంటారని ఆయన అన్నారు. తన అభిప్రాయాలు, విమర్శలను భిన్నంగా వ్యక్తపరిచే పోసాని కృష్ణమురళి.. వైఎస్ జగన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

  వైసీపీలో చేరిన సినీనటుల్లో పోసాని కృష్ణమురళి ముందువరుసలో ఉంటారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు, గత ఏడాది జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఆయన.. గత ఏడాది సినిమా టికెట్ల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు కౌంటర్ గా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ¬కామంట్స్ తర్వాత పోసాని పైనా జనసైనికులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

  ఇది చదవండి: ఆ విషయంలో పెద్దిరెడ్డిని ఢీ కొడుతున్న రోజా.. రేసులో గెలుస్తారా..?

  ఇదిలా ఉంటే కొంతకాలంగా సీఎం జగన్.. పోసానికి పదవి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు ఆలీని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో.. ఆయన కంటే ముందే వైసీపీలో చేరిన పోసానికి కూడా పదవినిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల సినీ ప్రముఖులు సీఎంను కలిసిన సందర్భంగానూ పోసాని వెళ్లారు. సినీ ప్రముఖుల కంటే ముందే జగన్ తో భేటీ అయ్యారు.

  ఇది చదవండి: 13 జిల్లాలు 11వేల అభ్యంతరాలు.. కొత్త జిల్లాలపై ప్రజల స్పందన ఇదే..

  త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో పోసాని చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తుస్తున్నాయి. సీఎం జగన్ ను ఏకంగా దైవప్రసాదంతో పోల్చడంతో ఆయన కూడా కేబినెట్ బెర్త్ కోసం ట్ ట్రై చేస్తున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆలీకి రాజ్యసభ ఇస్తే కచ్చికంగా పోసానికి కూడా పదవి ఇస్తారన్న చర్చ జరుగుతోంది. గతంలో నటుడు పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా ఎంపిక చేయగా.. ఆయన వివాదంలో చిక్కుకొని పదవిని కోల్పోయారు. మరి పోసాని విషయంలో సీఎం నిర్ణయం ఎలా ఉండబోతోంది.. పదవి రాబోతున్నందునే పోసాని అలాంటి కామెంట్స్ చేశారా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Posani Krishna Murali

  ఉత్తమ కథలు