పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై పోటీకి సిద్ధమని నటుడు అలీ (Actor Ali) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ నాకు మంచి మిత్రుడు. కానీ సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా కూడా పోటీ చేస్తానన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. 2024లో వైసీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా అలీని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో అలీ అనేక సినిమాలు చేశాడు. అయితే రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రస్తుతం అలీ (Actor Ali) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
పవన్ నాకు మంచి మిత్రుడే కానీ..
రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్ధమని అలీ (Actor Ali) మీడియాతో తెలిపారు. సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై కూడా పోటీకి సిద్ధమని అన్నారు. అంతేకాదు మా ముఖ్యమంత్రి ఏదైతే టార్గెట్ పెట్టారో అది ఖచ్చితంగా సాధిస్తాం. 175 సీట్లలో వైసిపి విజయం సాధిస్తుందన్నారు. రాజకీయాలు వేరు. ఫ్రెండ్షిప్ వేరు. ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అందుకే పార్టీ ఆదేశానుగుణంగా ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి నేను సిద్ధమని అలీ పేర్కొన్నారు.
రోజాపై పవన్ వ్యాఖ్యలకు అలీ కౌంటర్..
కాగా రోజాపై ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలకు అలీ (Actor Ali) కౌంటర్ ఇచ్చారు. రోజా ఫైర్ బ్రాండ్. ఆమె ఎక్కడా తగ్గదు. మెగా ఫ్యామిలీతో రోజాకు మంచి అనుబంధం ఉందన్నారు. ఇక విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణం. రోజాను డైమండ్ రాణితో పోల్చడమంటే విలువైనదిగా పోల్చడమేనని అలీ (Actor Ali) వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే గత సార్వత్రిక ఎన్నికల ముందు నటుడు అలీ వైసిపిలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. గతేడాది అక్టోబర్ లో అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించింది. 2 ఏళ్ల పాటు అలీ ఈ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనీ అలీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పవన్ పై వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అలీ వ్యాఖ్యలపై జనసేనాని స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhrapradesh, Ap, Janasena, Pawan kalyan, Ycp