హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వైసీపీపై అలీ అసంతృప్తి..? ఆ పార్టీవైపు చూస్తున్నారా..? అక్కడి నుంచే పోటీ..?

వైసీపీపై అలీ అసంతృప్తి..? ఆ పార్టీవైపు చూస్తున్నారా..? అక్కడి నుంచే పోటీ..?

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

సీఎం జగన్‌తో అలీ (ఫైల్ ఫోటో)

అలీ (Actor Ali) తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) లో బాల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి స్టార్ కమెడియన్ గా హీరోగా అంచలంచలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నటుడు. సినీ పరిశ్రమలో సౌమ్యుడిగా అంరికీ తలలో నాలుకలా వ్యవహరించే నటుడు ఆలీ.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Andhra Pradesh, India

  Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

  అలీ (Actor Ali) తెలుగు సినిమా పరిశ్రమ (Tollywood) లో బాల నటుడిగా ప్రస్థానం ప్రారంభించి స్టార్ కమెడియన్ గా హీరోగా అంచలంచలుగా ఎదిగి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న నటుడు. సినీ పరిశ్రమలో సౌమ్యుడిగా అంరికీ తలలో నాలుకలా వ్యవహరించే నటుడు ఆలీ. రాజకీయంగా కూడా తనను తాను నిరూపించుకోవాలని ఆలీ ఎంతగానో పరితపిస్తుంటారు. జనసేన అధినేత (Janasena Party), పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) కెరీర్ ప్రారంభం నుండి అలీ పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో నటిస్తుండేవారు. పవన్ కళ్యాణ్ కు ఎంతో దగ్గర మిత్రుడిగా ఉన్న ఆలీ గతంలో టీడీపీకి సన్నిహితంగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ (YSRCP) తీర్ధం పుచ్చుకోవటం అప్పట్లో సంచలనం గా మారింది.

  వైసీపీ తీర్ధం పుచ్చుకున్నప్పటి నుండి మైనారిటీ కోటలో గుంటూరు తూర్పు నుండి లేదా రాజమండ్రి నుండి టికెట్ వస్తుందని ఆశించిన ఆలీ ఆ తరువాత రాజకీయ సమీకరణలలో భాగంగా ఆ అవకాశాన్ని సైతం కోల్పోయారు. అయినా గత ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేసిన అలీకి సీఎం సీఎం జగన్ రాజ్యసభకు పంపిస్తానని హామీ ఇచ్చారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. తరువాత వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అవకాశం వస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి.

  ఇది చదవండి: ఎన్టీఆర్‌పై హీటెక్కిన ఏపీ రాజకీయం.. బాబును వెంటాడుతున్న గతం.. విజయవాడలో వెలసిన పోస్టర్లు..

  ఐతే అలీ విషయంలో జరిగిన ప్రచారం ఒకటి.. వాస్తవం మరొకటి. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా.. ఆయనకు మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఇలా పదవులు ఆశిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. వైసీపీలో తన పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికి తనను పట్టించుకునే పరిస్థితి ఉండదని అలీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే తనకు విలువలేని చోటు కంటే విలువ ఇచ్చే పార్టీలోకి వెళ్లడం బెటరని అలీ డిసైడ్ అయ్యారని టాక్.

  అందుకే తన స్నేహితుడైన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని అలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పెద్దలతో చర్చలు కూడా జరిగాయని.. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లేదా గుంటూరులో ఎక్కడి కావాలంటే అక్కడ టికెట్ ఇచ్చేలా హామీ కూడా లభించిందన్న ప్రచారం జరుగుతోంది. ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలనే అలీ కోరిక ఏ పార్టీ తీరుస్తుందో అనే చర్చ మాత్రం జోరుగా జరుగుతోంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Ali, Andhra Pradesh, Janasena party, Ysrcp

  ఉత్తమ కథలు