AP POLITICS ACTOR ALI ANGRY ON CM JAGAN AND YCP HIGH COMMAND AFTER HIS NAME NOT SEEN IN RAJYA SABHA CONTESTANTS LIST FULL DETAILS HERE PRN BK
Actor Ali: వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో అలీ..? కారణం ఇదేనా....?
సీఎం జగన్ తో అలీ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP)కి సినీగ్లామర్ కాస్త తక్కువే. అలాంటి వైసీపీలో చేరి పార్టీ కోసం ప్రచారం చేశారు నటుడు అలీ (Actor Ali). జగన్ పాదయాత్ర సమయంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారంలో ఉన్న వైసీపీ (YSRCP)కి సినీగ్లామర్ కాస్త తక్కువే. అలాంటి వైసీపీలో చేరి పార్టీ కోసం ప్రచారం చేశారు నటుడు అలీ (Actor Ali). జగన్ పాదయాత్ర సమయంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి రాకముందు ఆయన తన వంతుగా పార్టీ కోసం కృషి చేశారు. అయితే 2019 ఎన్నికల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు జగన్ కూడా అంతే ప్రాదాన్యత ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి ఆయన తరువాత అప్పుడుప్పుడు అలీతో భేటీలు కూడా నిర్వహించారు. మొన్నటికి మొన్న సినిమా టికెట్ల అంశం వచ్చినప్పుడు కూడా సీఎం జగన్ ముందుగా అలీ, పోసాని లాంటి వాళ్లను పలిపించుకొని మాట్లాడారు. తరువాత ఆ సమావేశానికి చిరంజీవి, ప్రబాస్, మహేష్, లాంటి వారు హజరైయ్యారు. కొన్నిరోజుల తర్వాత అలీతో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేసుకున్న జగన్ ఆయనకు రాజ్యసభ అవకాశం ఇస్తానని కూడా హామి ఇచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ వార్తలను బలపర్చే విధంగా జగన్ తో సమావేశం తరువాత బయటకు వచ్చిన అలీ త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ ఉంటుంది వెళ్లండి అని చెప్పారని మీడియాకు తెలిపారు. దీంతో అలీకి రాజ్యసభ పక్కా అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలీ కూడా ఈసారి జగన్ తనకు అవకాశమిస్తారని భావించినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. అయితే ఎవరూ ఉహించని విధంగా పార్టీ తరుపు నుంచి రాజ్యసభకు వెళ్లే వారిలో అలీ పేరు లేకపోవడం ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు పిలిపించుకోని హామీలు ఇవ్వాలని అలీ ఆయన సన్నిహితులు వద్ద వాపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకుంటాం కాని అవుతాయా అని తనకి తాను సర్థిచెప్పుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ అధిష్టానం ఇచ్చిన షాక్ తో అలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల వైసీపీ కండువా కప్పుకున్న అలీ అప్పుడు జగన్ ను ఎమ్మెల్యే టిక్కెట్ అడిగారు. అయితే అప్పుడున్న సామాజికవర్గాల సమీకరణలో టిక్కెట్ ఇవ్వలేకపోయారు.
దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత రాజ్యసభ అవకాశం కోసం అలీ అడిగినప్పుడు కూడా జగన్ సముఖంగానే ఉన్నారన్న ప్రచారం జరిగింది. నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెడ్డి, కాపు, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పిస్తారని... మైనార్టీ కోటాలో అలీకి ఎంపీ పదవి గ్యారెంటీ అని వార్తలు వచ్చాయి. అయితే చివరి లిస్ట్ వచ్చినప్పటికి అలీ పేరు లేకవపోవడం ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తర్వలో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల సమయంలో అలీ, నటుడు పృథ్వీ , కృష్టుడు, పోసాని మురళి వంటి వారు పార్టీ కోసం ప్రచారం చేశారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కకరిగా వాళ్లు పార్టీకి దూరమవుతుండటం చర్చనీయాంశమవుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.