AB Venkateswar Rao: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వాన్ని వదల బొమ్మాళి అంటున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao).. ఇటీవల సుప్రీం కోర్టు (Supreme Court) తీర్పు తరువాత ఏపీ ప్రభుత్వానికి (AP Government) వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఇవాళ నేరుగా ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అది కూడా యూనిఫాంలో సెక్రటేరియట్‌కు వచ్చారు ఏబీవీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ (Sameer Sharma)ను కలిశారు.. ఎందుకంటే ఇటీవలే..? ఏబీ వెంకటేశ్వపరావుకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు ఏబీవీ.. ఈ సందర్భంగా ఓ లేఖను సీఎస్‌కు సమర్పించారు. తన పోస్టింగ్, పెండింగ్ జీత భత్యాల విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లానని.. అవసరమైన ఆదేశాలివ్వాలని కోరినట్టు వెల్లడించారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రిపోర్ట్ చేశాను.. లెటర్ ఇచ్చాను.. పోస్టింగ్ విషయం ప్రాసెసులో పెడతారనకుంటున్నాను అన్నారు.
మరోవైపు ఏబీ వెంకటేశ్వరరావు లోఖలో పేర్కొన్న విషయాలను పరిశీలిస్తే.. సస్పెన్షన్ రివోక్ చేయాలన్న సుప్రీం ఆదేశాలను పొందుపరిచారు. అలాగే తన సస్పెన్షన్ నుంచి సుప్రీం ఆదేశాల వరకు జరిగిన పరిణామాలను లేఖలో సీఎస్‌కు వివరించారు.. సుప్రీం ఆదేశాల మేరకు రిపోర్ట్ చేస్తున్నట్టు లేఖలో స్పష్టం చేశారు. పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాను అన్నారు. ఏ పోస్టింగుకు తాను అర్హుడినని ప్రభుత్వం భావిస్తుందో.. ఆ పోస్టింగ్ వేయాలని తాను ఇచ్చిన లేఖలో పేర్కొన్నాను అన్నారు. ముఖ్యంగా పెండింగ్ జీతభత్యాల చెల్లింపుల విషయంలో తగు చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. మరి ఏబీవీ పోస్టింగ్‌పై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి సీఎం జగన్ కు వచ్చిన మార్కులు ఎన్ని..? సర్వేల్లో అసలు నిజం ఎంత..? వారిపై వేటు తప్పదా..?
అసలు ఏబీవీను సస్పెండ్ చేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణాలు ఇవే..?
1.నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘాపరికరాల కొనుగోలు ఆరోపణలు
2.ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు
3.ఇజ్రాయెల్ సంస్ధ ఆర్టీ ఇన్ ఫ్లేటబుల్స్ తో కుమ్మక్కై కొడుకు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్సుడ్ సిస్టమ్స్ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపణ
4.విదేశీ సంస్ధతో కుమ్మక్కై కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని పేర్కొన్న ప్రభుత్వం
5.విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడం ద్వారా జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
6.నాణ్యతలేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపణ
7.రాష్ఠ్ర భద్రతకు సంబంధించిన సమాచారం విదేశీ సంస్ధలతో పంచుకోవడం భవిష్యత్ భద్రతకు ముప్పని ఆరోపణ
8.కాసులకు కక్కుర్తి పడి అనామక సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణ
9.కావాలనే టెండర్ల సాంకేతిక కమిటీలో నిపుణులకు స్ధానం కల్పించలేదని ఆరోపణ
10.విదేశీ సంస్ధకు మేలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు నిబంధనలు మార్చారని ఆరోపణ
11.ఇజ్రాయెల్ సంస్ధకు కాంట్రాక్టు ఇచ్చేందుకే మిగతా కంపెనీల అర్హతలను పట్టించుకోలేదని ఆరోపణ
12.నిఘా పరికరాల కొనుగోలుకు ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపణ
13.ఉద్దేశపూర్వకంగానే పరికరాల కొనుగోలు ఆర్డర్ కాపీలను మాయం చేశారని ఆరోపణ
14.కావాలనే పరికరాల కొనుగోళ్లలో సీనియర్ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారని ఆరోపణ
15.వెంకటేశ్వరరావు కుమారుడికి చెందిన కంపెనీకి లబ్ధి చేకూర్చే విధంగా ఇజ్రాయెల్ కంపెనీతో రహస్యంగా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.