టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై మంత్రి గుడివాడ అమర్ నాథ్ (Gudiwada Amar nath) షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎవరికి నష్టం, 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు ఇప్పుడు ప్రత్యేకంగా చివరి చివరి ఎన్నికలు ఏంటని ఎద్దేవా చేశారు. టీడీపీ (Tdp)కి, చంద్రబాబు (Chandra babu Naidu)కు ఇవే ఆఖరి ఎన్నికలు అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు (Chandra babu Naidu) ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని, రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తే కొట్టమని చెప్తారా? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు (Chandra babu Naidu) ఆయన పార్ట్నర్ గురించి అందరికి తెలుసని అన్నారు. అయితే 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబు (Chandra babu Naidu) చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు నేడు ఇన్ఫినిటీ వైజాగ్ 2023 ఐటీ సమ్మిట్ పోస్టర్, వెబ్ సైట్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ (Gudiwada Amar nath) ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి అమర్ నాథ్ (Gudiwada Amar nath) మాట్లాడుతూ..విశాఖలో వచ్చే ఏడాది ఐటీ సమ్మిట్ ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్ హోటల్ ఈ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే మొదటి రోజు ఎస్టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజి, స్టార్టప్ లతో పాటు ఐటీ అవార్డుల ప్రధానోత్సావం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఇక రెండో రోజు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ తో పాటు ఐటి రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని తెలిపారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నిన్నటి కర్నూల్ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'గూండాలందరినీ హెచ్చరిస్తున్నా. జాగ్రత్తగా ఉండాలి. దాడులకు పాల్పడిన వారిని తరిమి కొడదాం. పోలీసుల వల్ల కాకపోతే చెప్పండి నేను వస్తా. తమాషా అనుకున్నారా. వైసిపి చోటా మోటా రౌడీలు ఇలా దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. బట్టలిప్పించి కొట్టిస్తా దద్దమ్మల్లారా? పనికిమాలిన వ్యక్తుల్లారా నేరాలు ఘోరాలు చేసిన దరిద్రులారా అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను రౌడీలకు రౌడీ గుర్తు పెట్టుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోడానికి సంయమనం పాటిస్తున్నాం. మా కార్యకర్తలకు పిలుపునిస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే మీ జగన్ బయటకు వచ్చేవాడా? ఎవడ్రా రాయలసీమ ద్రోహి, రాయలసీమను రత్నాల సీమను చేసాం. రాయలసీమకు ద్రోహం చేసింది జగన్' అని ఆరోపించారు బాబు. ఈ క్రమంలో బాబు వ్యాఖ్యలకు వైసిపి నాయకులూ వరుస కౌంటర్లు ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, AP News, Chandrababu Naidu, Gudivada, TDP, Ycp