వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి (Ys Jagan Mohan Reddy) ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి నేటితో 5 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర ఓ మరపురాని ప్రయాణంగా జగన్ (Ys Jagan) ఎప్పటికి గుర్తుంచుకుంటారు. జగన్ (Ys Jagan) అధికారంలోకి రావడానికి ప్రజా సంకల్ప యాత్ర ఎంతగానో తోడ్పడింది. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Ys Rajashekar Reddy) సమాధి వద్ద జగన్ ఈ పాదయాత్రకు 2017 నవంబర్ 6న శ్రీకారం చుట్టారు. మొత్తం 14 నెలల పాటు 13 జిల్లాల్లో కొనసాగిన ఈ యాత్ర 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ముగిసింది.
Ganjikuntapalli women gave Harathi @ysjagan#PrajaSankalpaYatra#AndhraPradesh@ManviDad@varun2c @HVRYSRCP @iamhvr@YSR4Ever@YSRCParty@IamKodaliNani@saiswapnaV@vintareddy @breddyinduri @tbrysrcp@2019YSRCP @nanireddyT @taruns_@ysrcpdmo@yamini_notepic.twitter.com/C833mXxbG2
— Praja Sankalpa Yatra (@WalkWithJagan) December 6, 2017
ఈ యాత్రలో జగన్ దాదాపు 2 కోట్ల మందితో మమేకమయ్యారు. అయితే మొదటగా యాత్ర 13 జిల్లాల్లో 6 నెలల పాటు జరుగుతుందని అంచనా వేశారు. కానీ అది కాస్త 14 నెలల పాటు సాగింది. మొత్తం 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాల పరిధిలోని 2 వేల 516 గ్రామాలూ, 62 నగరాలు , పట్టణాల్లో జగన్ యాత్ర కొనసాగింది.ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్ 3 వేల 648 కిలోమీటర్ల మేర నడిచారు. అలాగే ఈ యాత్రలో భాగంగా 124 భారీ బహిరంగ, 55 సభలు ఆత్మీయ సమ్మేళనాల్లో జగన్ పాల్గొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ కు పట్టం కట్టడానికి ప్రజా సంకల్ప యాత్ర బలమైన పునాదిగా మారింది. ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక వచ్చిన ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 శాసనసభ స్థానాల్లో విజయం సాధించారు. అలాగే 25 లోక్ సభ స్థానాల్లో 22 స్థానాల్లో వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. అయితే పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్ అనే నేను అంటూ హామీలు, వాగ్దానాలు ఇచ్చారు. ఇక 2019 మేలో ఫలితాల విడుదల తర్వాత సీఎం జగన్ అనే నేను అంటూ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మొట్టమొదటగా ఫించన్ రూ.2,250కి పెంచుతూ సంతకం చేశారు.
నేటికీ ప్రజాసంకల్ప యాత్ర ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని వైఎస్సార్సిపి కార్యాలయం తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.