జనతా కర్ఫ్యూ సందర్భంగా రేపు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు పోలీసులు సంసిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ నిర్వహిస్తుండడం పట్ల స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్... పౌరులంతా జనతా కర్ఫ్యూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండడం ద్వారా మద్దతు తెలపాలని అన్నారు. జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటించి కరోనా వైరస్‌ను జయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు పోలీసులందరూ స్టేషన్లలో అందుబాటులో ఉండాలని తెలిపారు. డయల్ 100 ద్వారా సేవలు పొందాలని ప్రజలకు ఏపీ డీజీపీ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, Gautam Sawang, Janata curfew