Home /News /andhra-pradesh /

AP POLICE SEVA APP WILL GIVE 87 TYPES SERVICES ON SINGLE PLATFORM FULL DETAILS HERE PRN

AP Police: ఈ యాప్ చేతిలో ఉంటే చాలు.. ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు.. 87 రకాల సేవలు మీ అరచేతిలో..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

AP Police Seva App: ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఎలాంటి సమాచారానికైనా యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మన పనికి సంబంధించిన వివరాలతో పాటు గైడెన్స్ కూడా ఇస్తాయి. ఈ టెక్నాలజీ ఇప్పుడు కేవలం ఎంటర్టైన్ మెంట్, ఇతర సర్వీసులకే కాదు.. సెక్యూరిటీకి కూడా బాగా ఉపయోగపడుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. ఎలాంటి సమాచారానికైనా యాప్ ఓపెన్ చేస్తే చాలు.. మన పనికి సంబంధించిన వివరాలతో పాటు గైడెన్స్ కూడా ఇస్తాయి. ఈ టెక్నాలజీ ఇప్పుడు కేవలం ఎంటర్టైన్ మెంట్, ఇతర సర్వీసులకే కాదు.. సెక్యూరిటీకి కూడా బాగా ఉపయోగపడుతోంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి సమస్య ఎదురైనా.. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి.. అందులో ఈ యాప్ ఉంటే చాలు. కొండంత అండ మీకున్నట్లే. అలాంటిదే ఈ యాప్. ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే చాలు.. మీరిక భయపడక్కర్లేదు. ఆ సూపర్ యాప్ పేరే ఏపీ పోలీస్ సేవ యాప్ (AP Police Seva App). ఈ యాప్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటే చాలు.. పోలీసులు మీ వెంటనే ఉన్నంత భరోసా ఉంటుంది. ప్రమాదమైనా, సమస్య అయినా, దాడి అయినా.. ఏదైనా సరే పోలీసులు అండగా నిలుస్తారు.

    పోలీస్ సేవ యాప్ కేవలం కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులకు సమాచారం అందించడమే కాదు.. మొత్తం 87 రకాల సేవలను సింగిల్ యాప్ ద్వారా అందిస్తోంది ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్. మొత్తం ఆరు విభాగాల్లో సాయం పొందే అవకాశముంది. లా అండ్ ఆర్డర్, ఎన్ ఫోర్స్ మెంట్, పబ్లిక్ సర్వీస్, రోడ్డు భద్రక, పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ ఔట్ రిచ్ విభాగాల్లో పోలీసులు సేవలందిస్తారు.

    ఇది చదవండి: ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం సహా ఈ ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటితోనే ప్రసాదాలు..


    లా ఆండ్ ఆర్డర్ విభాగంలో హత్యలు, దాడుల వంటి నేరాలు, వేధింపులకు సంబందించిన కంప్లైంట్స్, ఎఫ్ఐఆర్ స్టేటస్, దొంగతనాలు, రికవరీలు, మిస్సింగ్ కేసులు, గుర్తుతెలియని మృతదేహాలు, అరెస్టులు, కిడ్నాపుల వంటివాటిపై వివరాలు పొందే అవకాశముంది. ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలో హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఈ-బీట్, ఈ-చలాన్ వంటి స్టేటస్ లు సులభంగా తెలుసుకొవచ్చు. పబ్లిక్‌ సర్వీస్ విభాగంలో కంప్లైంట్స్, సర్వీస్ కి సంబంధించిన అప్లికేషన్లు, ఎన్ఓసీలు, వెరిఫికెషన్లు, లైసెన్సులు, పర్మిషన్స్, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ వంటి సేవలు పొందవచ్చు.

    ఇది చదవండి: ఒకప్పుడు కిలో రూ.160.. ఇప్పుడు రూ.8.. ఇంతలో ఎంత తేడా..!


    రోడ్ సేఫ్టీ విభాగంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్లు, యాక్సిడెంట్స్ మ్యాపింగ్, రోడ్ సేఫ్టీ సింబల్స్, బ్లడ్ బ్యాంక్స్, డయాలసిస్ సెంటర్లు, ఆస్పత్రులు, ఫార్మసీ వంటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ విభాగంలో పోలీస్‌ డిక్షనరీ, సమీప పోలీస్‌ స్టేషన్ల వివరాలు, టోల్‌ ఫ్రీ నంబర్లు, వెబ్‌సైట్ల వివరాలు, లీగల్ ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ నంబర్లను పొందవచ్చు. పబ్లిక్‌ అవుట్‌ రీచ్‌ విభాగంలో సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా, కమ్యూనిటీ పోలిసింగ్, స్పందన ఫిర్యాదుల వెబ్ సైట్, స్టేటస్, ఫ్యాక్ట్ చెక్ వట్టి సేవలు పొందవచ్చు.



    పోలీస్ సేవ యాప్ ఫోన్లో ఉంటే క్రైమ్ జరిగిన చోటు నుంచి వివిధ నేరాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చు. కంప్లైంట్ చేసిన వెంటనే ఐడీ నెంబర్ తో సహా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. అంతేకాదు సమస్య పరిష్కారానికి సంబంధించిన టైమ్ లైన్ కూడా అందుబాటులో ఉంటుంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Police

    తదుపరి వార్తలు