విజయవాడ దుర్గ గుడిపై కలకలం.... పోలీస్ అర్థనగ్న ప్రదర్శన

గత రాత్రి విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది.

news18-telugu
Updated: October 1, 2019, 11:40 AM IST
విజయవాడ దుర్గ గుడిపై కలకలం.... పోలీస్ అర్థనగ్న ప్రదర్శన
Video : విజయవాడ దుర్గ గుడిపై కలకలం.. పోలీస్ అర్థనగ్న ప్రదర్శన
  • Share this:
విజయవాడలో దసరా నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రిపై కలకలం రేపింది. తన తప్పు లేకున్నా తనను మందలించారని ఓ పోలీస్ అధికారి ఆందోళనకు దిగారు. దుర్గగుడి టోల్ గేట్ వద్ద పోలీస్ అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు ఉండటంతో వారిని సదరు పోలీస్ అధికారి అడ్డుకున్నారు. దీంతో అతడిపై ఉన్నతాధికారులు అంక్షింతలు వేశారు. దీంతో మనస్తాపంతో చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. గత రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసు అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఓ మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు.

అయితే, తన తప్పూ లేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. అయితే అధికారులు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ పోలీస్ అధికారి నిరసనకు దిగలేదన్నారు. అతనికి ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం గమనార్హంగా మారింది.First published: October 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>