news18-telugu
Updated: March 17, 2020, 4:01 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మాచర్ల ఘటనపై టీడీపీ నేతలు పోలీసులపై విమర్ళలు చేయడాన్ని ఏపీ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా తప్పుబట్టంది. ఈ అంశంలో టీడీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించి ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది. టీడీపీ నేతలపై దాడి సమాచారం రాగానే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడారని వివరించింది. తమ ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని... ప్రాణాలు కాపాడిన పోలీసులనే నిందించడం బాధ కలిగించిందని పేర్కొంది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయమని కోరితే... బాధితులు ఇవ్వలేదని ఆరోపించింది. దీనిపై సుమోటోగా కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నామని స్పష్ట చేసింది. నాయకులెవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది. తమపై అనవసర అభియోగాలు చేస్తే కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమంటూ టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది.
Published by:
Kishore Akkaladevi
First published:
March 17, 2020, 4:01 PM IST